Cotton Crop | తొగుట, ఆగస్టు 06 : తొగుట మండలంలోని ఎల్లారెడ్డిపేట్ గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) నాగార్జున పత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ప్రస్తుతం పత్తి పంట పూత, కాయ దశలో ఉంది. అధిక వర్షాలకు పత్తి పంట ఒత్తిడికి గురై పూత పిందే రాలడం, పంట ఎదుగుదల తగ్గడం జరుగుతున్నట్లు గమనించడం జరిగింది. రైతులు మొక్క ఎదుగుదల కొరకు 19-19-19 , 10 గ్రాముల లీటరు నీటికి, సూక్ష్మపోషకాలు 5 గ్రాముల లీటరు నీటికి పిచికారి చేసుకోవాలన్నారు.
అక్కడక్కడ మెగ్నీషియం, బోరాన్ లోపం గమనించడం జరిగింది. మెగ్నీషియం లోపం వలన ముదురాకులు ఎర్రబడడం నివారణ కోసం మెగ్నీషియం సల్ఫేట్ 10 గ్రాములు, లీటరు నీటికి పిచికారి చేసుకోవాలి. బోరాన్ లోపం వలన పూత, పిందె రాలడం జరుగుతుంది. వీటి నివారణ కొరకు బోరాక్స్ 1.5 గ్రా. లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలని రైతులకు సూచించారు.
పొలంలో నీళ్లు ఆగడం వలన కింద ఉన్న కాయలపై నల్ల మరకలు ఏర్పడి కుళ్లు తెగుళ్లు గమనించడం జరిగింది. వీటి నివారణ కొరకు ఎకరాకు 200 మి.లీ. ప్రొపికొనజోల్ పిచికారి చేసుకోవాలి. రసం పీల్చే పురుగులు, తామర పురుగు, పచ్చ దోమ గమనించడం జరిగింది. నివారణ కొరకు ముందుగా వేప నూనె 5 మి.లీ. అజాడిరక్టిన్ 1500 పి.పి.ఎమ్. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలన్నారు.
పచ్చదోమ, పేనుబంక నివారణ..
ప్లోమికామిడ్ 0.3 గ్రా.లీటరు నీటికి లేదా ఫిప్రోనిల్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. తామర పురుగు నివారణ ఎస్టామిప్రిడ్ 0.2 గ్రా.లీటరు నీటికి లేదా డైఫెన్ థయూరాన్ 1.25 గ్రా. లీటరు నీటికి కలిపి మార్చి మార్చి పిచికారి చేయాలి . మధ్య మధ్యలో వేప నూనె పిచికారి చేసుకోవాలి.
దాంతోపాటు నీలి తెలుపు, పచ్చని చిగురులు పొలంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే సమర్థవంతంగా రసం పీల్చే పురుగులను నివారించి రైతులు మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
Ghaati Day 1 | అనుష్క ‘ఘాటి’ మొదటి రోజు కలెక్షన్లు ఎంతంటే.!
Prabhas | డార్లింగ్ అభిమానులకు మాస్ అప్డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్
Unmukt Chand | క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ జీవితంపై డాక్యుమెంటరీ.. ట్రైలర్ రిలీజ్!