Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రాబోతున్న భారీ చిత్రం ‘స్పిరిట్’ ఇంకా సెట్స్‌పైకి వెళ్లకముందే భారీ స్థాయిలో హైప్‌ను క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై సందీప్ రెడ్డి స్వయంగా ఒక షాకింగ్ అప్డేట్ను పంచుకున్నారు. ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. స్పిరిట్ మూవీ షూటింగ్ త్వరలో మొదలవుతుంది. ఇప్పటికే బీజీఎం పనులు దాదాపు 70 శాతం పూర్తయ్యాయి. యానిమల్ టైంలో మాదిరిగానే ముందుగా మ్యూజిక్ వర్క్ పూర్తిచేస్తే, సీన్ అవుట్‌పుట్ ఎలా వస్తుందో ముందే అర్థమవుతుంది. ఇది టైమ్, ప్రొడక్షన్ బడ్జెట్ రెండింటినీ ఆదా చేస్తుంది అని అన్నారు.
ఇక ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ చాలా నిజాయితీగలవాడు, కోపం లేకుండా పని చేసే వ్యక్తి. స్టార్ అన్న అహంకారం ఆయనలో ఏమాత్రం లేదు. నేను ఊహించిన దానికన్నా ఎక్కువగా ఆయన ఈ సినిమాకు సహకరిస్తున్నారు. త్వరలోనే సెట్స్‌పైకి వస్తాం అని అన్నారు. ఇక ‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. ఇందులో ఒక పాత్ర పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కాగా, రెండోది ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో మాఫియా డాన్. ఈ మాస్ మిక్స్ క్యారెక్టర్స్‌తో సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనుంది. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి హిట్స్ ఇచ్చిన సందీప్ నుంచి ఇది మరో బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ ఇతర సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మారుతి దర్శకత్వంలో చేస్తున్న ది రాజా సాబ్ చిత్రం 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది. మరోవైపు ఫౌజీ (హను రాఘవపూడి డైరెక్షన్లో) చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ‘స్పిరిట్’ కోసం సందీప్ రెడ్డి పెట్టిన కండిషన్ ప్రకారం, ప్రాజెక్ట్ ప్రారంభమైన తర్వాత ప్రభాస్ వేరే సినిమా చేయకూడదు. ప్రభాస్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అందుకే షూటింగ్ షెడ్యూల్స్ అందుకు అనుగుణంగా ప్లాన్ చేస్తున్నారు.