Caste Occupations | రామాయంపేట, జూన్ 28 : కేసీఆర్ ప్రభుత్వంలో అందుకున్న ఫలాలను ఇప్పటికి కొంతమంది లబ్దిదారులు మరువడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కులవృత్తులకు కేసీఆర్ సార్ పెద్ద పీట వేశారు. సాయం అందుకున్న వారిలో గొర్రెల కాపర్లు ముందు వరుసలో ఉంటారు. ఎందుకంటే గొర్రెల కాపర్లకు మన తెలంగాణలో ఉపాధిలేక దేశ విదేశాలకు వెళ్లి పనులు చేసుకునే వారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే కేసీఆర్ సార్ ముందుగా కులవృత్తులకే ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. సమైక్య రాష్ట్రంలో ఉపాధిలేని వారంతా ఇతర దేశాలకు వలస వెళ్లి బతుకుతుండేవారు.
ఇది గ్రహించిన బీఆర్ఎస్ సర్కార్ అప్పట్లోనే వలసలు పోకుండా కులవృత్తుల వారీగా పలు పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రంలో ప్రతీ కులానికి ఉపాధి కల్పించారు. వివిధ కులాలకు చెందిన వలసలకు వెళ్లిన వారంతా తెలంగాణకు వచ్చి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అందించిన పధకాలనే కొనసాగిస్తున్నారు. గతంలో కేసీఆర్ సార్ హయాంలో అందుకున్న గొర్ల కాపర్లు ఇప్పటికీ కేసీఆర్ సార్‌ను మరువకుండా గొర్రెలను కాస్తూ కేసీఆర్ సార్నే గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ సర్కార్ మాయ మాటలు చెప్పి గద్దెనెక్కి నేడు కులవృత్తులు కనుమరుగు చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు..
సాయం చేసిన కేసీఆర్ సార్‌ను మరచిపోం : గొర్రెల కాపరులు సంతోష్‌కుమార్, శ్రీశైలం, లింగం
మేము గత దశాబ్దం క్రితం వరకు ఉపాధిని వెతుక్కుంటు గల్ఫ్ దేశాలకు వెల్లెవాల్లం. అక్కడే కూలీ నాలీ చేసుకుంటు కుటుంబాన్ని పోషించుకునే వాళ్లం. అప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, సీఎంగా కేసీఆర్ ఉండడంతో తమకు ఉపాధి మార్గం దొరికింది. గొర్రెల కాపరులకు సబ్సీడీపై గొర్రెలు అందించడంతో మేము గల్ఫ్ దేశాల్లో ఉండలేక తెలంగాణ వచ్చినం.
అప్పటికప్పుడే కేసీఆర్ సార్ యాదవులకు కొత్త పధకం పెట్టి గొర్రెలను అందించిండు.ఇప్పుడు ఆ గొర్రెలతోనే తమ జీవితాలు సాగుతున్నాయి.ప్రస్తుతం ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో కులవృత్తులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. 2022 సంవత్సరం నుండి అప్పుడు 21 గొర్రెలు, ఒక్క పోట్టేలు ఉంటే ఇప్పుడవి మూడోవంతుకు పెరిగాయి. మాకు, మా కులానికి కేసీఆర్ సార్ ధర్మాత్ముడు.ఆయన దయవల్ల గొర్రెలను కాపాడుకుంటూ ఎక్కడికి వలస వెల్లకుండా జీవాలను సాకుతున్నం. మాకు అప్పుడు ఇప్పుడు ఎప్పటికి కూడా కేసీఆర్ సారే కులదైవం.. దేవుడు.
Harish Rao | తెలంగాణ వాది స్వేచ్ఛ అకాల మరణం ఎంతో బాధాకరం : హరీశ్‌రావు
Operation Sindhu | ఆపరేషన్ సింధు ద్వారా 4,415 మంది భారతీయుల్ని తరలించాం : కేంద్రం