Sanitation | చిలిపిచెడ్, మార్చి 10 : పది నెలల నుంచి గ్రామాల్లో అధికారుల పాలన కొనసాగుతున్నది. కానీ మండలంలోని పలు గ్రామాల్లో మురుగు కాలువ శుభ్రం చేసే వారు కరువు అయ్యారు. చిలిపిచెడ్ మండలం సోమక్కపేట గ్రామ పంచాయతీ పరిధిలోని గంగిఎద్దుల గూడంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది.
గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలనలో ఎటు చూసినా వీధులు, పాఠశాలలు అపరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. గంగిఎద్దుల గూడంలో ఇండ్ల మధ్యన పాకురు పట్టిన మురుగుతో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. పాఠశాల ముందున్న వాటర్ ట్యాంక్ వద్ద మురుగు నీరుతో కంపు కొడుతున్నదని విద్యార్థులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో మురుగు కాల్వలు, పేరుకుపోయిన చెత్తాచెదారం పట్టించుకోని అధికారులు, మురుగు కాలువలో నీటిలో ప్లాస్టిక్ గ్లాసులు, డబ్బాలు, ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతున్నది. మురుగు కాలువలను శుభ్రం చేయడంలో అధికారులు చిత్తశుద్ధి కరువైంది. మండలంలోని సోమక్కపేట, అజ్జమర్రి, శీలాంపల్లి, జగ్గంపేట, రహీంగూడ తండా, సామ్ల్యా తండా, టోప్యి తండా, గన్య తండా గ్రామాల్లో మురుగు కాలువలు అధ్వానంగా తయారయ్యాయి.
ఎక్కడ చూసినా చెత్త..
ఎక్కడ చూసినా చెత్తతో నిండిపోయి కంపు కొడుతున్నాయి. దోమలు,ఈగలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడంతో పాటు రోగాల బారిన పడుతున్నారు. కానీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.ఇప్పటికైనా అధికారులు గ్రామాల్లో పర్యవేక్షించి చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
ఎన్నికలు వచ్చినపుడే గంగిఎద్దుల గూడం గుర్తుకు వస్తుందని గంగిఎద్దుల గూడం వాసి భాస్కర్ వాపోయాడు. ఎప్పుడు ఏ ఒక్క నాయకుడు వచ్చి సమస్యలు అడిగి పరిష్కరించే నాయకుడు, అధికారులు వచ్చి చూసే వారు లేదన్నారు. గంగి ఎద్దుల గూడంలో పారిశుధ్యం గురించి పట్టించుకునే వారు లేదన్నారు. గ్రామ కార్యదర్శి ఎప్పుడు గూడంకు వస్తుండో తెలువద్దు. పారిశుధ్యం, దుర్గంధంతో చాలా ఇబ్బందులతో బాధ్యపడుతున్నామన్నారు.
Read Also :
Nagarkurnool | చేతకాకపోతే గద్దె దిగండి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ పాడి రైతులు
Air India | అజర్బైజాన్ గగనతలంలో ప్రయాణిస్తున్న విమానానికి బెదిరింపులు.. ముంబైకి దారి మళ్లింపు
Donthi Madhav Reddy | అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇండ్లు : దొంతి మాధవరెడ్డి