Air India | దేశంలో బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. తాజాగా ముంబై నుంచి న్యూయార్క్ (Mumbai – New York Flight) వెళ్తున్న ఎయిర్ ఇండియా (Air India) విమానానికి బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పైలట్లు ఫ్లైట్‌ను తిరిగి ముంబైకి తిప్పారు. అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ కాగానే.. అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ముంబై నుంచి ఇవాళ తెల్లవారుజామున 2 గంటలకు న్యూయార్క్‌కు బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన నాలుగు గంటల తర్వాత సిబ్బందికి బెదిరింపు అలర్ట్ వచ్చింది. ఆ సమయంలో విమానం అజర్బైజాన్ (Azerbaijan) గగనతలంలో ప్రయాణిస్తోంది. బెదిరింపు అలర్ట్‌తో అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు. తిరిగి ఉదయం 10:25 గంటల సమయంలో ముంబైలో సేఫ్‌గా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 303 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బంది ఉన్నారు.
రంగంలోకి దిగిన అధికారులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్వ్కాడ్ సాయంతో విమానంలో తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఇప్పటి వరకూ ఎలాంటి అనుమానాస్పద వస్తువూ, పేలుడు పదార్థాలూ లభించలేదని తెలిసింది. ఈ బెదిరింపు ఓ టూటకమని అధికారులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాంబు బెదిరింపుతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Also Read..
ED Raids | మద్యం కుంభకోణం.. మాజీ సీఎం కుమారుడి నివాసంలో ఈడీ సోదాలు
Lalit Modi | లలిత్ మోదీకి షాక్.. పాస్‌పోర్ట్ రద్దు చేయాలంటూ వనౌట్ ప్రధాని ఆదేశం
Victory Rally | టీమ్ఇండియా విజయోత్సవ ర్యాలీపై రాళ్లదాడి.. రెండు వర్గాల మధ్య ఘర్షణ