Victory Rally | టీమ్ఇండియా విజయోత్సవ ర్యాలీపై రాళ్లదాడి.. రెండు వర్గాల మధ్య ఘర్షణ
భారత క్రికెట్ జట్టు (Team India) 12 ఏండ్ల తర్వాత చాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకున్నది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను మట్టికరిపించి ముచ్చటగా మూడోసారి ‘చాంపియన్స్’గా (Champions Trophy) నిలిచింది. దీంతో దేశవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి.
భోపాల్: భారత క్రికెట్ జట్టు (Team India) 12 ఏండ్ల తర్వాత చాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకున్నది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను మట్టికరిపించి ముచ్చటగా మూడోసారి ‘చాంపియన్స్’గా (Champions Trophy) నిలిచింది. దీంతో దేశవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. పటాకుల మోతలు, విజయోత్సవ ర్యాలీలతో (Victory Rally) ప్రజలు సంతోషాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో పలుచోట్ల అవాంఛనీయ ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లా మోవ్ పట్టణంలో కొందరు యువకులు టీమ్ఇండియా విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని జామా మసీద్ వద్దకు ర్యాలీ చేరుకున్నది. అయితే కొందరు వ్యక్తులు ర్యాలీపై రాళ్లతో దాడిచేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. పరస్పరం రాళ్లతో దాడిచేసుకున్నారు. పలు దుకాణాలను ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పంటించారు. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నదని ఇండో జిల్లా కలెక్టర్ వెల్లడించారు.
ఇరు వర్గాల ఘర్షణతో మోవ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెకొన్నాయని ఇండరో రూరల్ ఎస్పీ హితికా వాసల్ చెప్పారు. టీమ్ఇండియా విజయం సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తుండగా ఘర్షణ నెలకొన్నదని తెలిపారు. పటాకులు కాల్చడం వల్ల వివాదం మొదలైందని వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయని పేర్కొన్నారు. ఊహాగాణాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అసత్య వార్తలను నమ్మకూడదని సూచించారు. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారని, గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, బాధ్యులతపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరస్పర దాడిలో ముగ్గురు గాయపడ్డారని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

