Scavengers | రామాయంపేట, జూన్ 10 : ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచడంలో స్కావెంజర్లు ముందుండాలని రామాయంపేట మండల విద్యాధికారి అయిత శ్రీనివాస్ ఏర్కొన్నారు. మంగళవారం రామాయంపేట మండల వనరుల కేంద్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల నుండి హాజరైన స్కావెంజర్లకు ఒక రోజు శిక్షణ ఇచ్చారు.
ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో శుభ్రతను పాటించాలన్నారు. పాఠశాలలో టాయిలెట్లు శుభ్రంగా ఉంచడంతోపాటు మొక్కలను విరివిగా పెంచే బాధ్యత కూడా స్కావెంజర్లదేనని అన్నారు. ప్రతీ పాఠశాలలో కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల పరిశుభ్రత కోసం ప్రభుత్వం చీపుర్లు, బ్రష్లు, టాయిలెట్ క్లీనర్లు అన్ని రకాల సామాగ్రిని అందజేస్తుందన్నారు.
ఏ పాఠశాలలోనైనా శుభ్రత పాటించకుంటే ఆ పాఠశాలకు చెందిన స్కావెంజర్లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పీలు సంతోష్, శ్రీకాంత్, రాజు, శంకర్ తదితరులు ఉన్నారు.