Collector RahulRaj | మెదక్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): మహిళల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రి బాయి ఫూలే అని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. శనివారం మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని మెదక్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులతో కలిసి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.
ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. మహిళలకు, ఆడబిడ్డల చదువు కోసం సావిత్రిబాయి పూలే చేసిన విశేష సేవలకుగాను ప్రతి ఏటా జనవరి 3న వారి సేవలు స్మరించుకుంటూ అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామని గుర్తు చేశారు.
మహిళలకు చదువు ప్రాముఖ్యతను చాటి చెప్పిన వీర వనిత..
నేటి సమాజంలో ప్రతి సామాన్యుడికి, మహిళలకు చదువు ప్రాముఖ్యతను చాటి చెప్పిన వీర వనిత సావిత్రిబాయి ఫూలే అన్నారు. సమాజ చైతన్యం విద్య ద్వారా సాధ్యపడుతుందని మహిళలు విద్యను అభ్యసించి మహిళా ఉపాధ్యాయినులుగా అనేక రంగాల్లో చరిత్రపుటల్లో తమదైన స్థానాన్ని సంపాదించుకున్నారని వివరించారు.
ఎందరో మహిళామణులు విద్య ద్వారా ఉపాధ్యాయులుగా అనేక రంగాలలో ప్రథమ స్థానంలో ఉన్నారన్నారు. మహిళల చదువు, వారి అభ్యున్నతి, మహిళా టీచర్లు గురించి, వారు విద్యను అభ్యసించి మరొకరికి విద్యాబోధన చెప్పవచ్చు అని చెప్పిన వీరవనిత సావిత్రిబాయి ఫూలే అని గుర్తు చేశారు. ఎంతోమంది త్యాగధనుల ఫలితమే మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందని తెలిపారు.
సమాజ చైతన్యంలో మహిళల భాగస్వామ్యాన్ని గుర్తు చేస్తూ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ ,జిల్లా విద్యాశాఖ అధికారి విజయ, జెడ్పి సీఈఓ ఎల్లయ్య,డిపిఓ యాదయ్య, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి,మహిళా ఉపాధ్యాయులు, విద్యా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Jogu Ramanna | రైతు సమస్యలపై మాజీ మంత్రి ఆధ్వర్యంలో ఆందోళన
Khammam Rural : 32 వార్డులు 45 వేల మంది ఓటర్లు.. ఈఎంసి ఓటరు డ్రాఫ్ట్ జాబితా విడుదల
Bonakal : అంగన్వాడీ పిల్లలకు యూనిఫాం పంపిణీ