NIMZ Farmers | ఝరాసంగం, సెప్టెంబర్ 15 : రాష్ట్ర ప్రభుత్వం మా భూములలో ప్రతిపాదించిన నిమ్జ్ ఏర్పాటు ప్రజా ప్రయోజనం కాదని మేము బలంగా నమ్ముతున్నామని ఎల్గోయి భూ బాధిత రైతులు పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో డిప్యూటీ తహసీల్దార్ కరుణాకర్ రావుకు 195.13 ఎకరాల భూమి సేకరణకు సంబంధించి రైతుల అభ్యంతర దరఖాస్తును అందించారు.
ప్రతిపాదిత పరిశ్రమలు పెట్టడానికి ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నంత భూమి కూడా అవసరం లేదని, అంత వ్యవసాయ భూమిని ఇప్పటికే 12,635.14 ఎకరాల భూముల సేకరణకు ప్రతిపాదనలు పెట్టుకున్న విషయం తెలిసిందే. మా గ్రామంలోనే ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కింద దాదాపు 1800 ఎకరాలకు పైగా భూములు తీసుకున్నారు. గత 8 సంవత్సరాల క్రితం తీసుకున్న భూములలోనే ఇప్పటివరకు ఎలాంటి పనులు చేయలేదు. కావున ఇది ప్రజాప్రయోజనం కాదు చట్ట వ్యతిరేకం అని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు మాలో కొంతమంది భూములు తక్కువ నష్టపరిహారంతో ఇచ్చారు.ఆ భూములలోనే ఏం చేయలేదని, మళ్లీ కొత్తగా భూములు తీసుకోవడం అన్యాయమన్నారు.ఈ భూములే మాకు జీవనాధారమని, వీటిని తీసుకోబోమని గతంలో హామీ ఇచ్చారన్నారు.
ఇప్పటికే సేకరించిన భూమికి అదనంగా మాభూమి అవసరమా? అదనంగా సేకరిస్తున్న భూమి ప్రాజెక్టు ప్రతిపాదనలో ఉందా? సదరు ప్రతిపాదిత పరిశ్రమల ద్వారా వెలువడే కాలుష్యం కారణంగా మేము మా గ్రామంలో నివసించలేని పరిస్థితిలు కూడా ఉత్పన్నం కావని మేము నమ్మడం లేదన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లల ఆరోగ్యం పై తీవ్రప్రభాతం చూసే అవకాశాలు లేక పోలేదన్నారు. మా భూములు అత్యంత సారవంతమైనవని,మేము తరతరాలుగా వ్యవసాయమే వృత్తిగా బ్రతుకుతున్నామని, అలాంటి భూములలో వాణిజ్య,ఉద్యాన పంటలతో పాటు,పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలను పండిస్తూ బోర్లు బావుల ద్వారా వ్యవసాయం చేస్తున్నమన్నారు.
వ్యవసాయ కూలీ కుటుంబాలకు కూడా ప్రత్యక్షంగా జీవనోపాధి..
రకరకాల పంటలు పండిస్తూ మా కుటుంబాలతోపాటు ఎన్నో వ్యవసాయ కూలీ కుటుంబాలకు కూడా ప్రత్యక్షంగా జీవనోపాధి దొరుకుతుందన్నారు. వ్యవసాయేతర అవసరాలకు పరిశ్రమల కోసం సేకరించడానికి నిర్ణయించి ప్రాథమిక ప్రకటన జారీ చేశారు. సదరు భూములపై ఆసక్తి కలిగిన వారిని చట్టంలో సెక్షన్ 15 కింద ప్రకటన వెలువడిన 60 రోజులులోపు అభ్యంతరాలు పెట్టుకోమని కోరారు.
సదరు సెక్షన్ కింద అభ్యంతరాలు కేవలం మీరు ప్రతిపాదించిన ప్రయోజనం ప్రజా ప్రయోజనమా కాదా? ప్రజా ప్రయోజనానికి మా భూమి, అంత భూమి అవసరమా కాదా? సామాజిక ప్రభావం మల్లింపు పైన ఏమైనా అభ్యంతరాలు వంటి విషయాలు సమర్పించాలి కానీ అభ్యంతరాలు పెట్టాలంటే మాకు ప్రతిపాదిత ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులో లేవని పేర్కొన్నారు.
మా గ్రామంలో పర్యావరణ ప్రభావ మదింపులో భాగంగా సామాజిక ప్రభావం అధ్యయనం చేయలేదని, సామాజిక అంశాలను సరిగ్గా విశ్లేషించలేదని తెలిపారు. చేపట్టాల్సిన సంప్రదింపులు, సామాజిక, ఆర్థిక స్థితిగతుల అధ్యయనం లేకుండా అన్నిటి కన్నా ముఖ్యంగా ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక ప్రకటన చట్ట ప్రకారం చెల్లదని రైతులు దరఖాస్తులో పేర్కొన్నారు.
Bhoodan Pochampally : పింఛన్లు పెంచాలని భూదాన్ పోచంపల్లి తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
man shot wife dead | మరో వ్యక్తి బర్త్ డే పార్టీలో భార్య.. వీడియో చూసి కాల్చి చంపిన భర్త
SIR | ‘సర్’ చెల్లుబాటుపై అక్టోబర్ 7న తుది వాదనలు వింటాం : సుప్రీంకోర్టు