Lorry Overturns | హత్నూర, మే 20 : మద్యం లోడ్‌తో వెలుతున్న లారీ బోల్తాపడి డ్రైవర్ మృతిచెందిన సంఘటన హత్నూర మండలం చందాపూర్ శివారులో ప్రధానరోడ్డుపై సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. హత్నూర ఎస్ఐ శ్రీధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం శివంపేట శివారులోని బీరు ఫ్యాక్టరీ నుండి లారీ మద్యం లోడ్‌తో సోమవారం అర్ధరాత్రి సమయంలో కరీంనగర్ వెళ్తుండగా.. చందాపూర్ శివారులో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి బోల్తా పడినట్లు తెలిపారు.
ఈ ప్రమాదంలో లారీడ్రైవర్ ప్రవీన్ (23) అక్కడికక్కడే మృతిచెందగా.. క్లీనర్ మహమ్మద్ మంజుమీల్ ప్రమాదం నుండి బయటపడినట్లు తెలిపారు. కాగా లారీడ్రైవర్ ప్రవీన్ స్వస్థలం కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా, ఔరాద్ తాలుకా, చింతకీ గ్రామంగా తెలిపాడు. మృతుడి తల్లి అనూషాబాయి ఇచ్చిన పిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
Karimnagar | బొమ్మనపల్లిలో అగ్ని ప్రమాదం.. రూ. 2 లక్షలకు పైగా నష్టం..
Landslides | కైలాస్ యాత్ర మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. చిక్కుకుపోయిన వందలాది మంది యాత్రికులు
Warangal fort | కోటను సందర్శించిన రాజు కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ