Pyaranagar Dumping Yard | గుమ్మడిదల, జూన్ 14 : ప్యారానగర్ డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్న రైతు జేఏసీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. శనివారానికి 130వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షల్లో రైతు జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్ గ్రామశివారులో ఏర్పాటు కాబోతున్న డంపింగ్‌యార్డు (ఎంఎస్‌డబ్ల్యూ)ను రద్దు చేసేదెప్పుడో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు నెలలకుపైగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మనస్సు కరుగడం లేదని వాపోతున్నారు. ఇలాంటి మొండి వైఖరి ఉన్న రాష్ట్ర పాలకవర్గాన్ని ఎప్పుడు చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల గోడు పట్టించుకోని సర్కారుకు భవిష్యత్‌లో మంచి గుణపాఠం మిగులుతుందని హెచ్చరించారు. ఇకనైనా సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు మొండివైఖరిని విరమించుకుని అనుమతిచ్చిన డంపింగ్‌యార్డును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also :
కుట్రతోనే కేటీఆర్‌కు నోటీసులు.. ఎక్స్ వేదికగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కాంగ్రెస్‌వి డైవర్షన్ రాజకీయాలు.. మధుసూదనాచారి
Kaleru Venkatesh | పేదలకు ఆపత్కాలంలో ఆర్థిక చేయూత ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్