ఎదులాపురం, మార్చి 19 : ఉగాది పండుగను పురసరించుకొని మాజీ మంత్రి జోగు రామన్న శాంతినగర్‌లోని సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు పరాభవ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నివాసంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తరలివచ్చి మాజీ మంత్రి జోగు రామన్నను కలుస్తూ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ జిల్లా ప్రజలకు పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒకరు అషె్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని కోరారు.