Fertilizers | జహీరాబాద్, జూన్ 19 : జహీరాబాద్ పట్టణంలోని గ్రోమోర్ ఎరువులు, విత్తనాల దుకాణాన్ని గురువారం మండల వ్యవసాయాధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక దుకాణంలో విక్రయిస్తున్న ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులకు సంబంధించిన స్టాక్ రికార్డులు, నిల్వలను మండల వ్యవసాయాధికారిణి లావణ్య పరిశీలించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు, విత్తనాలు, మందులను రైతులకు విక్రయించాలన్నారు. వాటికి సంబంధించిన ఇన్వాయిస్, సోర్స్ ఆఫ్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. రైతులకు విక్రయించే ఎరువులు, విత్తనాలు, మందులకు తప్పనిసరిగా రశీదులను ఇవ్వాలని సూచించారు.
నాసిరకం ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులను అమ్మితే కఠినే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణంలో విక్రయిస్తున్న ఎరువుల నాణ్యతను పరీక్షించేందుకు సేకరించిన శ్యాంపిల్ ఎరువులను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపుతున్నామన్నారు. ఆమె వెంట మండల వ్యవసాయ విస్తరణ అధికారులు తదితరులు ఉన్నారు.
Bonakal : ‘కాంగ్రెస్ నాయకుల నుండి రక్షించండి’
GHMC | ఇదేనా స్వచ్చ సర్వేక్షన్ స్పూర్తి.. చెత్త తరలింపులో బల్డియా నిర్లక్ష్యం
Banjarahills | వర్షాకాలంలో రోడ్ల తవ్వకాలపై నిషేదానికి తూట్లు.. కమిషనర్ ఆదేశాలను తుంగలో తొక్కి పనులు