Drainage canal slab | ఝరాసంగం, ఏప్రిల్ 12: మండల పరిధిలోని ఎల్గోయి గ్రామంలో హనుమాన్ మందిరం సమీపంలో రోడ్డుపై ఉన్న మురుగు నీటి కాలువ స్లాబ్ పూర్తిగా ధ్వంసమై గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వారం రోజులుగా ఈ సమస్య వల్ల రాకపోకలు కష్టతరమవుతున్నాయి. ద్విచక్ర వాహనాలు తప్ప పెద్ద వాహనాలు ఈ మార్గంలో వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
పంచాయతీ అధికారులు పలుమార్లు తాత్కాలిక మరమ్మత్తులు చేసినప్పటికినీ మూడు నుంచి నాలుగు నెలల తర్వాత అదే పరిస్థితి నెలకొంటుంది. ఈ ధ్వంసమైన మురుగు కాలువ స్లాబ్ వల్ల రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడుతుంది. అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఈ విషయమై ఎంపీడీవో సుధాకర్‌ను సంప్రదించి వివరణ కోరగా.. మురుగు కాలువ స్లాబ్ శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదనలు పంపించాము. నిధులు మంజూరైన వెంటనే పరిష్కారం చేస్తామంటూ.. అప్పటి వరకు తాత్కాలిక మరమ్మత్తులు వెంటనే చేయిస్తామని తెలిపారు.
Ramakrishna Math | రామకృష్ణ మఠంలో వేసవి శిక్షణా శిబిరాలు
padi koushik reddy | బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
Mutton | మటన్‌ను ఎంత మోతాదులో తింటే మంచిది..? ఈ లిమిట్ దాటితే కష్టమే..!