Arrest | మునిపల్లి, ఆగస్టు 23 : గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై మునిపల్లి ఏఎస్ఐ రాజేష్ నాయక్ మాట్లాడుతూ.. జహీరాబాద్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు TS 07 KG 9474 నంబర్ గల బైక్‌పై ఎండు గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నామని.. వారి వద్ద నుంచి 500 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
శనివారం మండల పరిధిలోని కంకోల్ గ్రామ శివారులో గల డెక్కన్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ నిరహించారు. ఈ సందర్బంగా నమ్మదగిన సమాచారం మేరకు తన సిబ్బందితో కంకోల్ టోల్ ప్లాజా వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా.. యాక్టివా స్కూటీని పోలీసులు తనిఖీ చేయగా అందులో ఎండు గంజాయి కనిపించడంతో పోలీసులు అప్రమత్తమై వారిని విచారించారు.
గంజాయి తరలిస్తున్న వారిని మందుగుల మారుతి(24), బదన్న్పేట్ కాలనీ, హైదరాబాద్, మందుగుల అఖిల్(18) రచూర్, కల్వకుర్తి ప్రాంతాలకు చెందిన వారీగా పోలిసులు గుర్తించినట్లు తెలిపారు. 500 గ్రాముల ఎండు గంజాయిని బీదర్‌లోని ఇరానీ గల్లీలో గుర్తు తెలియని వ్యక్తి వద్ద కొనుగోలు చేశామని ఎస్ఐ తెలిపారు.
Bibinagar : బీబీనగర్ ఎయిమ్స్‌లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి : పిట్టల అశోక్
Peddapally | యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. బాలల పరిరక్షణ విభాగం సామాజిక కార్యకర్త శ్యామల
Sanjay Dutt | సంజూ భాయ్ అతడిని అలా కొట్టాడేంటి.. వైరల్ అవుతున్న వీడియో