 
                                                            Tholi Ekadashi | ఝరాసంగం, జూలై 6 : ప్రకృతికి, మానసిక ప్రశాంతతకు నిలయమైన బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం దత్తాత్రేయ స్వామి వారికి సుప్రభాత సేవ, గోపూజ, గణపతి పూజ, ఉదయం 10:15 నిమిషాలకు యజ్ఞశాల ప్రవేశం. వైదిక విద్యార్థులతో వేదమంత్రాల మధ్య ప్రవేశం నిర్వహించారు.
11 గంటలకు నారాయణ హోమం వేదమంత్రాలు వల్లిస్తూ పురోహితులు నారాయణ హోమాన్ని ప్రారంభించారు. 12 గంటలకు నారాయణ హోమం పూర్ణాహుతి నిర్వహించారు. రాత్రి మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి బ్రహ్మ కమలాలు ఒకేసారి 5 వికసించాయి. ఆ పుష్పాలను స్వామివారికి సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఆశ్రమ పీఠాధిపతులు 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్, మహామండలేశ్వర డాక్టర్ మహంత్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్, నందిని శ్రీగిరిమాత, వైదిక పాఠశాల విద్యార్థులు, భక్తులు పాల్గొన్నారు.

Sigachi Industries | సిగాచి ఇండస్ట్రీస్ పేలుడు ఘటనలో 41కి చేరిన మృతులు.. ఇంకా దొరకని 9 మంది ఆచూకీ
Dalai Lama | ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
 
                            