TGSRTC | జహీరాబాద్, జూన్ 17 : ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల సమష్టి కృషితోనే సంస్థ లాభాల వైపు పయనిస్తోందని ఆర్టీసీ హైదరాబాద్ జోన్ ఈడీ ఖుస్రోషా ఖాన్ అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్టీసీ డిపోను మంగళవారం ఆయన సందర్శించారు. డిపోలోని ఉద్యోగులు, కార్మికులతో గేటు మీటింగ్ నిర్వహించి ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
గత ఏడాది కాలంగా కార్మికులు, ఉద్యోగులు అంకితభావంతో పనిచేయడంతో సంస్థ లాభాల వైపు మళ్లిందన్నారు. ఇదే స్పూర్తితో పని చేస్తే రానున్న ఒకటి రెండేళ్లలో కష్టాలు దూరం అవుతాయని అన్నారు. స్థానిక డిపోకు అవసరమైన కొత్త బస్సుల కేటాయింపు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారమయ్యేలా చూస్తానని భరోసా కల్పించారు. అనంతరం స్థానిక డిపో గ్యారేజీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రీజియన్, డిపో అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
F-35 fighter jet | ఇంకా కేరళలోనే F-35 ఫైటర్ జెట్.. ఎందుకంటే..!
OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఉప్పు కప్పురంబు.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!
Robert Vadra | ఈడీ విచారణకు మరోసారి డుమ్మా కొట్టిన రాబర్ట్ వాద్రా