Robert Vadra | కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా (Robert Vadra) మరోసారి ఈడీ (Enforcement Directorate) విచారణకు డుమ్మా కొట్టారు. తన కుమార్తె స్నాతకోత్సవానికి హాజరు కావడానికి విదేశాలకు వెళ్తున్నానని, తిరిగి వచ్చాక విచారణకు హాజరవుతానని ఈడీ అధికారులకు రాబర్ట్ వాద్రా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.
కాగా, యూకేకు చెందిన ఆయుధాల కన్సల్టెంట్ సంజయ్ భండారీ (Sanjay Bhandari)కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రా వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడానికే ఈడీ సమన్లు (Summons) జారీ చేసింది. వాస్తవానికి జూన్ 10నే రాబర్ట్ వాద్రా ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ 56 ఏళ్ల వాద్రా తనకు జూన్ 9న ఫ్లూ లాంటి లక్షణాలు ఉన్నాయని, ప్రోటోకాల్ ప్రకారం కొవిడ్ టెస్ట్ చేయించుకున్నానని చెప్పి గైర్హాజరు అయ్యారు. దీంతో ఆయనకు ఈడీ మరోసారి సమన్లు పంపింది. జూన్ 17న తమ ముందు హాజరు కావాలని రాబర్ట్ వాద్రాను ఈడీ కోరింది. అయితే, ఈసారి కూడా ఈడీ సమన్లను రాబర్ట్ వాద్రా దాటవేశారు.
Also Read..
Air India | మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య.. అహ్మదాబాద్ టు లండన్ ఫ్లైట్ క్యాన్సిల్
Indian Students | ఇరాన్ నుంచి అర్మేనియా చేరుకున్న 110 మంది భారతీయ విద్యార్థులు.. రేపు ఢిల్లీకి