SugarCane field | ఝరాసంగం, మార్చి 24: ఓ రైతు విద్యుత్తు తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు స్పందించలేదు. చివరికి ఆ విద్యుత్ తీగలకే సదరు రైతుకే చేతికొచ్చిన పంట కాలిబూడిదైంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని కుప్పానగర్ గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం చెరుకు రైతు ఇస్మాయిల్ ఆశలను అగ్నిపాలయ్యేలా చేసింది. విద్యుత్తు తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు స్పందించకపోవడంతో చివరకు షార్ట్ సర్క్యూట్ అయి చేతికొచ్చిన చెరుకు పంట దగ్ధమైంది.
బాధితుడు ఇస్మాయిల్ తెలిపిన వివరాల ప్రకారం.. కుప్పానగర్ శివారులో ఏర్పాటు చేసిన విండ్ పవర్ జంక్షన్ పక్కనే అతని చెరుకు తోట ఉంది. ఈ జంక్షన్ సమీపంలో 33 కేవీ విద్యుత్తు తీగలు భూమికి అతి సమీపంలో వేలాడుతున్నాయి. గాలి వీచిన సమయంలో ఈ తీగలు ఒకదానికొకటి తగిలి నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. దీంతో ఒక్కసారిగా తోటలో మంటలు చెలరేగి పంట అంతా అగ్నికి ఆహుతైంది.
పట్టించుకోని అధికారులు..విద్యుత్తు తీగలు కిందికి వేలాడుతూ ప్రమాదాలకు సంకేతంగా ఉన్నాయని, వీటిని సరిచేయాలని గతంలోనే పలుమార్లు విండ్ పవర్ అధికారులకు విన్నవించినా వారు ఏమాత్రం పట్టించుకోలేదని బాధితుడు ఇస్మాయిల్ వాపోయాడు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తనకు భారీ నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి తనకు నష్టపరిహారం చెల్లించాలని, అలాగే వేలాడుతున్న విద్యుత్తు తీగలకు తక్షణమే మరమ్మతులు చేపట్టి ఇతర రైతుల పంటలకు ముప్పు లేకుండా చూడాలని కోరుతున్నాడు.

Lokesh Kanagaraj | లోకేష్ కనగరాజ్ షూటింగ్ వాహనంలో AK-47లు.. తనిఖీల్లో అధికారులకు షాక్!
Vijayawada | విజయవాడలో టెర్రర్ కలకలం.. ముగ్గురు యువకులను ఉగ్రవాదంవైపు నెట్టిన హైదరాబాద్ యువతి!
వికారాబాద్ జిల్లాలో సర్పంచ్ ఇంటికి నిప్పంటించిన దుండగుడు.. పలువురికి తీవ్ర గాయాలు