Lokesh Kanagaraj | లోకేష్ కనగరాజ్ షూటింగ్ వాహనంలో AK-47లు.. తనిఖీల్లో అధికారులకు షాక్!
Lokesh Kanagaraj | తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమాల్లో గన్లు, గ్యాంగ్స్టర్లు ఉండటం మామూలే అన్న సంగతి తెలిసిందే.
Lokesh Kanagaraj | తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమాల్లో గన్లు, గ్యాంగ్స్టర్లు ఉండటం మామూలే అన్న సంగతి తెలిసిందే. కానీ తాజాగా చెన్నై వీధుల్లో జరిగిన ఒక సీన్ చూసి పోలీసులు సైతం నిజమైన సినిమానే అనుకున్నారు. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అశోక్ నగర్ జంక్షన్లో ఒక మినీ వ్యాన్‌ను ఆపి తనిఖీ చేయగా, లోపల ఉన్న దృశ్యం చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఏకంగా 10కి పైగా AK-47 రైఫిళ్లు ఆ వాహనంలో దర్శనమివ్వడంతో అది ఏదో పెద్ద స్మగ్లింగ్ ముఠా పనే అని అధికారులు ఉలిక్కిపడ్డారు. తీరా ఆరా తీస్తే, అది మన ‘లోకీ’ సినిమా సెట్ నుంచి వస్తున్న వాహనం అని తేలింది.
లోకేష్ నటిస్తున్న ‘DC’ సినిమా షూటింగ్ కోసం వాడిన ఈ తుపాకులు నిజానికి ఇనుముతో చేసిన డమ్మీ ప్రాప్స్. షూటింగ్ ముగిశాక వాటిని తిరిగి వడపళనిలోని గోడౌన్‌కు తరలిస్తుండగా ఈ ట్విస్ట్ ఎదురైంది. మొదట సీరియస్ అయిన పోలీసులు, చిత్ర యూనిట్ దగ్గరున్న పక్కా అనుమతి పత్రాలు చూసి షాక్ నుంచి తేరుకున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ కావడంతో, సినిమాలో మాత్రమే కాదు, బయట కూడా లోకేష్ లెక్కలే వేరు అంటూ ఫ్యాన్స్ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్‌తో చేయబోయే భారీ ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉండటం విశేషం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

