Students Ganesha | మునిపల్లి, ఆగస్టు 26 : రేపు వినాయక చవితి సందర్భంగా మునిపల్లి మండలంలోని తాటిపల్లి గ్రామ శివారులో గల యునైటెడ్ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. వినాయక చవితికి ఒక రోజు ముందే విద్యార్థులంతా కలిసి గణనాయకుడి రూపాన్ని కండ్ల ముందుంచారు.మంగళవారం చిన్నారులంతా విఘ్నేశ్వరుడి (వినాయకుడి) ఆకారంలో కూర్చున్నారు.
అచ్చం వినాయకుడే కండ్ల ముందు ప్రత్యక్షమయ్యాడా అన్నట్టుగా అనిపించేలా విద్యార్థులంతా గణేశుడిలా కూర్చొని అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్బంగా యునైటెడ్ పాఠశాల కరస్పాండెంట్ తాటిపల్లి మల్లేశం మాట్లాడుతూ.. పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు యునైటెడ్ పాఠశాల సిబ్బంది క్రమం తప్పకుండా ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రాష్టంలో జరుపుకునే ప్రతి పండగకు సంబంధించి తమ పాఠశాలలో చిన్నారులతో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేయిస్తున్న పాఠశాల సిబ్బందిని కరస్పాండెంట్ మల్లేశం అభినందించారు.
Nennela | నెన్నెల మండలంలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలి : ఎంపీడీవో మహ్మద్ అబ్దుల్
Annamalai | బీజేపీ నేత అన్నామలై చేతులమీదుగా మెడల్ అందుకోవడానికి నిరాకరించిన యువకుడు.. వీడియో
Hyderabad | ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. మెహిదీపట్నంలో ప్రమాదం