ద ఓవల్: ఇంగ్లండ్ ఆల్ రౌండర్ విల్ జాక్స్(Will Jacks) కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. ద హండ్రెడ్ క్రికెట్ టోర్నీలో ఓవల్ ఇన్విన్సిబుల్ తరపున ఆడుతున్న అతను.. ఫీల్డింగ్‌తో తన ట్యాలెంట్ చాటాడు. లండన్ స్పిరిట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బ్యాటర్ ఓలీ పోప్ భారీ షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు. సామ్ కరన్ బౌలింగ్‌లో మిడాన్ మీదుగా షాట్ ఆడాడు. అయితే ఆ బంతి మిడాన్ మీదుగా వెళ్తున్న సమయంలో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న విల్ జాక్స్ జంప్ చేస్తూ క్యాచ్ పట్టాడు. స్టన్నింగ్ రీతిలో ఒక్క చేయితోనే ఆ క్యాచ్ అందుకున్నాడు. విల్ జాక్స్ క్యాచింగ్ వీడియో వైరల్ అవుతున్నది.
ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో లండన్ స్పిరిట్ జట్టుపై ఓవల్ ఇన్విన్సిబుల్ జట్టు గెలిచింది. తొలుత ఫీల్డింగ్‌లో సత్తా చాటిన జాక్స్ ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ దుమ్మురేపాడు. అతను కేవలం 27 బంతుల్లో 45 రన్స్ చేశాడు. మరో 20 బంతులు ఉండగానే 153 రన్స్ టార్గెట్‌ను ఇన్విన్సిబుల్ జట్టు ఛేజ్ చేసింది. ద హండ్రెడ్ టోర్నీ పాయింట్ల పట్టికలో ఇన్విన్సిబుల్ జట్టు టాప్‌లో ఉన్నది. 8 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు 24 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
Will Superman Jackspic.twitter.com/mGeZXZNCOC
— Mumbai Indians FC (@MIPaltanFamily) August 26, 2025