నిజాంపేట,ఆగస్టు26 : మెదక్ జిల్లా నిజాంపేట గ్రామానికి చెందిన దండు బాలరాజ్ (37), రజక్ పల్లికి చెందిన రాజు, తిప్పనగుల్లకు చెందిన మల్లేశం వివిధ కారణాలతో ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న లీల గ్రూప్ చైర్మన్, కాంగ్రెస్ నేత డాక్టర్ మోహన్ నాయక్ మంగళవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనంతరం 25 కిలోల బియ్యం తో పాటు రూ. 5000 చొప్పున వారికి అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, గ్రామ అధ్యక్షుడు కోమ్మాట బాబు,నాయకులు రాజునాయక్, వెంకటేశం, శ్రీనివాస్, సుధాకర్ తదితరులు ఉన్నారు