Sri Ketaki Sangameshwara Swamy Temple | ఝరాసంగం, ఏప్రిల్ 4 : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ పాలక మండలిని నియమిస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల 7వ తేదీన ఆలయ ఆవరణలో పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
2023 అక్టోబర్ మాసంలో అప్పటి పాలక మండలి సభ్యుల పదవీకాలం ముగిసింది. దాదాపు 18 నెలలపాటు పాలక మండలి సభ్యులు లేకుండానే కొనసాగింది. పాలక మండలిలో జి లక్ష్మయ్య, పోలీసు మల్లప్ప, కొబ్బ శివకుమార్, మాలి పట్లోళ్ల నవాజ్ రెడ్డి, అప్పన్నగారి చంద్రశేఖర్, ఎక్కెల్లి శ్రీనివాస్, తిరుమలేశ్ మంకాల్, గడ్డం మల్లికార్జున్, పట్లోళ్ల మల్ శెట్టి, సుంచు లక్ష్మి, పటేల్ విఠల్ రెడ్డి, ఎక్స్ ఆఫీసియో సభ్యుడు బసయ్య స్వామి పేర్లు ప్రకటించారు.
ప్రమాణ స్వీకారానికి మంత్రులు దామోదర్ రాజనర్సింహ, కొండా సురేఖ, జహీరాబాద్ ఎంపీ సురేశ్ కుమార్ శెట్కార్, మాజీ మంత్రి, జహీరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ చంద్ర శేఖర్, స్థానిక నాయకులు హాజరు కానున్నారని అధికారులు తెలిపారు.
Passengers | 40 గంటలుగా తుర్కియే ఎయిర్‌పోర్ట్‌లోనే.. వసతుల లేమితో భారతీయ ప్రయాణికుల అవస్థలు
Alampur | అలంపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గవ్వల శ్రీనివాసులు
Taj Mahal: టికెట్ సేల్స్ ద్వారా ఆదాయం.. టాప్‌లో తాజ్‌మహల్