Special buses | జహీరాబాద్, జూన్ 9 : జహీరాబాద్ ఆర్టీసీ డీపో నుంచి భక్తుల దైవ దర్శనాల కోసం ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని జహీరాబాద్ ఆర్టీసీ డీపో మేనేజర్ టీ స్వామి పేర్కొన్నారు. స్థానిక డీపో నుంచి యాదగిరి గుట్టకు ఉదయం 7 గంటలకు బయలు దేరి 10 గంటలకు చేరుకుంటుందన్నారు. భక్తుల దర్శన అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు భువనగిరిలోని స్వర్ణగిరి ఆలయ దర్శనం తర్వాత రాత్రి 7 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు జహీరాబాద్‌కు చేరుకుంటుందని తెలిపారు.
ప్రతీ పౌర్ణమికి కర్టాటకలోని గాణగాపూర్లోని దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్లేందుకు స్థానిక బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సు సాయంత్రం 4 గంటలకు బయలు దేరి రాత్రి 8 గంటలకు చేరుకుంటుందన్నారు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు బయలు దేరి 11 గంటలకు జహీరాబాద్‌కు చేరుకుంటుందని చెప్పారు.
భక్తుల కోసం డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులను అందుబాటులో ఉంచామన్నారు. ఈ నెల 10వ తేదిన గాణుగాపూర్ దత్తాత్రేయ స్వామి దర్శన నిమిత్తం వెళ్లే భక్తుల కోసం బస్సును నడుపుతున్నట్టు పేర్కొన్నారు. ఈ బస్సు బస్టాండ్‌లో సాయంత్రం 7 గంటలకు బయలు దేరి రాత్రి 11 గంటలకు చేరుకుంటుందన్నారు. అసక్తిగల భక్తులు అదనపు సమాచారం కోసం సెల్‌ఫోన్ నంబర్లు 9676161161, 9121418750, 9494093486, 9959226269లకు సంద్రించాలని సూచించారు.
Gudem Mahipal Reddy | అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: పటాన్చెరు ఎమ్మెల్యే
Naresh | ఏడుపాయల వన దుర్గమ్మ సేవలో నరేష్..