కల్హేర్, మే 11: మండల కేంద్రమైన కల్హేర్లో ఐకేపీ ఆధ్వర్యంలో జొన్నల కేంద్రాన్ని ప్రారంభించారు. యాసంగి రైతులు పండించిన జొన్నలను దళారులకు విక్రయించకుండా కేంద్రానికి తీసుకురావాలని సీసీ నర్సింలు రైతులను కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రంలో విక్రయిస్తే రైతులకు మద్దతు ధర అందుతుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో వీవోఏ బాలమణి, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులతో పాటు రైతులు పాల్గొన్నారు.