Bob Cowper : ఆస్ట్రేలియా క్రికెట్లో విషాదం నెలకొంది. ఆ దేశ మాజీ క్రికెటర్ బాబ్ కౌపర్ (Bob Cowper ) కన్నుమూశాడు. కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 84 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచాడు. ఈ విషయాన్ని ఆదివారం వెల్లడించిన క్రికెట్ ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడి మృతి పట్ల సంతాపం ప్రకటించింది.
‘తొలి తరం క్రికెటర్ బాబ్ కౌపర్ మృతి చెందారనే విషయం తెలిసి ఎంతో చింతిస్తున్నాం. ఆస్ట్రేలియా క్రికెట్లో ఆయనకు ఎంతో గౌరవమర్యాదలు ఉన్నాయి. బాబ్ అద్భుతమైన బ్యాటర్. ఇంగ్లండ్‌పై మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో ఆయన కొట్టిన ట్రిపుల్ సెంచరీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 1960వ దశకంలో బాబ్ బ్యాటింగ్ అటు ఆసీస్‌తో పాటు విక్టోరియా జట్టు విజయాల్లో కీలకమైంది’ అని క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ మైక్ బైర్డ్ తెలిపాడు.
Australian cricket has lost a legend in Bob Cowper, the man who scored the first Test triple hundred on Australian soil. Full story: https://t.co/tDXD349nhY
— cricket.com.au (@cricketcomau) May 11, 2025
లెఫ్ట్ హ్యాండర్ అయిన కౌపర్ దేశవాళీలో విక్టోరియా జట్టు తరఫున 66 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 53.00 సగటుతో రాణించిన ఆయన 4,611 పరుగులతో సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఆస్ట్రేలియా జాతీయ జట్టు ఆటగాడిగా తనదైన విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించాడీ క్రికెటర్. అయితే.. 1966లో కౌపర్ ఇంగ్లండ్‌పై కొట్టిన ట్రిపుల్ సెంచరీ ఆయన కెరియర్‌కే హైలైట్.
బాబ్ కౌపర్
మెల్బోర్న్లో 12 గంటలపాటు క్రీజులో నిలిచిన ఆయన.. ఇంగ్లీష్ బౌలర్లను విసిగిస్తూ 589 బంతుల్లో 307 పరుగులు బాదాడు. 20వ శతాబ్దంలో ఆసీస్ తరఫున టెస్టుల్లో మూడొందలు కొట్టిన రికార్డు ఇప్పటికీ కౌపర్ పేరిటే ఉంది. బాబ్ 1964 జూలై నుంచి 1968 జూలై మధ్య కాలంలో 27 టెస్టులు ఆడాడు. దంచికొట్టడమే తెలిసి ఆయన రికార్డు స్థాయిలో 2,061 రన్స్ సాధించాడు. ఆల్‌రౌండ్‌గా తన ముద్ర వేసిన కౌపర్ బంతితోనూ విజృంభించి 36 వికెట్లు పడగొట్టాడు. కౌపర్కు భార్య డేల్ కూతుళ్లు ఒలీవియా, సెరాలు ఉన్నారు.