Brian Lara : టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు సిద్ధమైన విరాట్ కోహ్లీ (Virat Kohli)ని బీసీసీఐ సహా పలువురు మాజీ క్రికెటర్లు వారిస్తున్నారు. తన దూకుడుతో సుదీర్ఘ ఫార్మాట్‌కు వన్నె తెచ్చిన విరాట్ మరికొన్ని రోజులు ఆడాలని ఆశిస్తున్నారు. వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా (Brian Lara) సైతం ఇదే అభిప్రాయం వెలిబుచ్చాడు. టెస్టు క్రికెట్ సజీవంగా.. సమున్నతంగా ఉండాలంటే కోహ్లీ లాంటి ఆటగాడు ఉండాలని లారా అన్నాడు. టెస్టులకు కోహ్లీ అవసరం ఉంది. అతడు ఇకపై మరింత దూకుడుగా ఆడుతాడు. సగటు 60 దాటుతుందని కరీబియన్ లెజెండ్ వెల్లడించాడు.
‘టెస్టు క్రికెట్‌కు విరాట్ కోహ్లీ అవసరం ఎంతో ఉంది. అతడు మరికొన్నాళ్లు సుదీర్ఘ ఫార్మాట్ ఆడాలి. అతడితోనే ఆటకు అందం. కోహ్లీ టెస్టులకు రిటైర్ అవ్వడని నేను అనుకుంటున్నా. ఇకపై అతడి సగటు 60కి పైనే ఉంటుంది’ అని లారా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. కోహ్లీకి కొన్నేళ్లుగా గమనిస్తున్నా లారా.. అతడు భావి స్టార్ అవుతాడని ముందే చెప్పాడు. ఈ విండీస్ మాజీ క్రికెటర్ విషయానికొస్తే.. టెస్టుల్లో 400 నాటౌట్‌తో చరిత్ర సృష్టించాడు.
ఫ్యాబ్ 4లో ఒకడిగా పేరొందిన కోహ్లీ.. గత కొంత కాలంగా టెస్టుల్లో మునపటిలా ఆడడం లేదు. వన్డేలు, టీ20ల్లో ఇరగదీస్తున్న ఈ రణ్ మెషీన్ టెస్టు సెంచరీల్లో తన సహచరుల కంటే చాలా వెనకబడ్డాడు. ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీతో మెరిసిన విరాట్ ఆ తర్వాత విఫలమయ్యాడు. దాంతో.. ఇంగ్లండ్ పర్యటనకు ముందే విరాట్ వీడ్కోలుకు సిద్ధమయ్యాడు. అయితే.. ఇప్పటికే కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇవ్వడంతో సీనియర్ అయిన కోహ్లీ జట్టులో ఉండాలని బీసీసీఐ భావిస్తోంది.
అందుకే.. ఇంగ్లండ్ పర్యటనలో అనుభవజ్ఞుడైన అతడు జూనియర్లకు మార్గనిర్దేశనం చేయాలని మాజీలు సూచిస్తున్నారు. సో.. కోహ్లీ కూడా జట్టు ప్రయోజనాల దృష్ట్యా వీడ్కోలు నిర్ణయాన్ని వాయిదా వేసుకునేలా ఉన్నాడు. పైగా అతడు 10 వేల పరుగుల మైలురాయికి చేరువగా ఉన్నాడు. ఇంకో 770 రన్స్ కొడితే కోహ్లీ దిగ్గజాల సరసన చేరుతాడు. కాబట్టి.. మరికొన్ని రోజులు ఈ స్టార్ ఆటగాడు టెస్టుల్లో ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. జూన్ 20న ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా, రిషభ్ పంత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశముంది.