అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ( AP High Court ) రేపటి నుంచి నెల రోజుల పాటు వేసవి సెలవులు ( Summer vacations) ప్రకటించారు. ఈనెల 12 నుంచి జూన్ 13వ తేదీ వరకు సెలవులుంటాయని ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ వైవీఎస్‌బీజీ, పార్థసారథి ఉత్తర్వులిచ్చారు. జూన్ 16న పూర్తిస్థాయిలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయని వివరించారు.
అత్యవసర కేసుల విచారణకు గాను వకేషన్ కోర్టులను ఏర్పాటు చేశారు. మొదటి దశలో మే 15, 22, 29 తేదీల్లో, రెండో దశలో జూన్ 5,12 తేదీల్లో విచారణలు జరుగనున్నాయని వివరించారు. మే 15, 22న జస్టిస్ కె సురేష్‌రెడ్డి, జస్టిస్ వై లక్ష్మణరావు, మే 29న జస్టిస్ ఎన్ హరినాథ్, జస్టిస్ వై లక్ష్మణరావు, డివిజన్ బెంచ్‌లో, జస్టిస్ చల్లా గుణరంజన్ సింగిల్ బెంచ్‌లో విచారణలు చేస్తారని తెలిపారు.
జూన్ 5,12 వ తేదీల్లో జస్టిస్ ఎం కిరణ్మయి, జస్టిస్ టీసీడీ శేఖర్ డివిజన్ బెంచ్‌లో, జస్టిస్ కుంచం మహేశ్వర రావు సింగిల్ బెంచ్‌లో కేసులను నిర్వహిస్తారని తెలిపారు. డివిజన్ బెంచ్ కేసుల విచారణ పూర్తయ్యాక సింగిల్ బెంచ్ విధులనూ న్యాయమూర్తులు నిర్వహిస్తారని పేర్కొన్నారు.