Salaries | నిజాంపేట్, జూలై 19 : సంగారెడ్డి నాందేడ్ అకోలా ప్రధాన 161 జాతీయ రహదారిలో సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల పరిధిలో ఒక కిలోమీటర్ మేరలో ఉన్న శంకరంపేట ప్రాజెక్టు ఆఫీసులో చాలామంది కిందిస్థాయి ఉద్యోగులు పని చేస్తున్నారు. అందులో కొంతమంది పెట్రోలింగ్ విభాగంలో మరికొందరు ఎమర్జెన్సీ వాహనంగా పిలువబడే ఆంబులెన్స్ విభాగంలో, హైడ్రా విభాగంలో మరికొందరు విధులు నిర్వహిస్తున్నారు. వీరందరూ హైవే పనులు మొదలైనప్పటి నుండి విధులు నిర్వహిస్తున్నారు.
గత మూడు సంవత్సరాల క్రితం క్యూబ్ అనే సంస్థ పనిచేసింది. ఆ సంస్థ పని చేసిన సమయంలో వేతనాలు సరైన సమయంలో ఇచ్చినప్పటికీ చివరిలో సంవత్సరం ఒక మారు ఇచ్చే బోనస్ ఇవ్వక వెళ్లిపోయింది. తరువాత టీబీఆర్ అనే సంస్థ బాధ్యతలు చేపట్టిన తరువాత నెలవారి వేతనాలు ఇచ్చి చివరిలో మొదటి క్యూబ్ సంస్థ చేసినట్లే ఈ టీబీఆర్ సంస్థ కూడా బోనస్ ఇవ్వక వెళ్లిపోయింది.
భయభ్రాంతులకు గురి చేస్తూ..
ప్రస్తుతం ప్రోజ అనే కంపెనీ సంస్థ బాధ్యతలు చేపట్టి రెండు నెలలకే విధులు నిర్వహిస్తున్న వారందరికీ భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రతీ నెల మొదటి వారంలో ఇవ్వాల్సిన వేతనాలు నెలాఖరి వరకు ఇవ్వకపోవడంతో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సమ్మె చేస్తే వారికి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వేతనాలు అందక సిబ్బంది చాలా ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. వేతనాలు ఇవ్వకపోతే మా భార్య బిడ్డలని ఎలా పోషించేదని వారు వాపోతున్నారు. వెంటనేపై అధికారులు స్పందించి సరైన మొదటి వారంలోనే వేతనాలు అందే విధంగా చూడాలని వారు కోరుతున్నారు.
ఇదిలా ఉండగా గత 15 రోజుల క్రితం 161 హైవేపై పనిచేస్తున్న ఈ సంస్థపై నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన వార్త వల్ల ఆ మండల విలేకరికి ప్రోజ సంస్థ అధికారి ఫోన్ కాల్ ద్వారా బెదిరింపులు చేస్తున్నారు అందుకు పై అధికారులు విచారణ జరిపి వీరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. లేదంటే సంస్థ ముందు సమ్మె చేయడానికి వెనకాడబోమని అంటున్నారు.
Yadagirigutta : యాదగిరిగుట్టలో రూ.5 వేలతో గరుఢ టికెట్ !
అప్రెంటీస్ విధానంలో టీజీఎస్ఆర్టీసీలో దరఖాస్తుల ఆహ్వానం
Online scams | ఆన్ లైన్ మోసాలపై ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.. షీ టీం సీనియర్ సభ్యురాలు స్నేహలత