Nallavagu Project | సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం నల్లవాగు మధ్య తరహా ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో కొందరు మట్టి కట్టలు వేసి కబ్జాకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని గుర్తించిన నీటిపారుదల శాఖ అధికారులు సర్వే జరిపారు. కబ్జాకు గురైన FTL ప్రాంతాన్ని గుర్తించి ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ మేరకు అక్రమంగా కబ్జా చేసిన మట్టి కట్టలను జేసీబీ ద్వారా తొలగించినట్లు సంబంధిత ఇరిగేషన్ డీఈఈ పవన్ కుమార్ తెలిపారు.
ఈ పనులను ఏఈఈ లు మల్లేష్, శ్రీవర్ధన్ రెడ్డి పర్యవేక్షించారు. నల్ల వాగు పరివాహక ప్రదేశంలో అక్రమంగా చొరబడి కబ్జాకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ పనుల్లో నీటిపారుదల శాఖ సిబ్బంది ఉన్నారు.
Yadagirigutta : యాదగిరిగుట్టలో రూ.5 వేలతో గరుఢ టికెట్ !
అప్రెంటీస్ విధానంలో టీజీఎస్ఆర్టీసీలో దరఖాస్తుల ఆహ్వానం
Online scams | ఆన్ లైన్ మోసాలపై ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.. షీ టీం సీనియర్ సభ్యురాలు స్నేహలత