Local Body Reservations | జహీరాబాద్, అక్టోబర్ 1 : స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారుల తప్పిదం వల్ల రిజర్వేషన్ల కేటాయింపులో ఎస్సీ వర్గాలకు అన్యాయం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసేందుకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. అందులో వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసేందుకు ఎస్సీలకు రిజర్వేషన్లు కేటాయించలేదు.
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం లోని ఖలీల్ పూర్, చీకుర్తి , అత్తనూర్ గ్రామపంచాయతీ వార్డు సభ్యుల స్థానాలకు ఎస్సీలకు మాత్రం కేటాయించలేదు. ఖలీల్ పూర్ గ్రామంలో 879 మంది ఓటర్లు ఉండగా అందులో ఎస్సీలు 199 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలో 8 వార్డులు ఉండగా బీసీ బీసీ మహిళ జనరల్ మహిళకు కేటాయించారు. హత్నూర్ గ్రామంలో 1375 మంది ఓటర్లు ఉండగా 273 మంది ఎస్సీ ఓటర్లు ఉన్నారు. ఈ గ్రామంలో కూడా 8 వార్డులు ఉండగా బీసీ, బీసీ మహిళ, అన్ రిజర్వ్డ్ మహిళ స్థానాలకు రిజర్వేషన్ కేటాయించారు.
చీకుర్తి గ్రామంలో916 మంది ఓటర్లు ఉండగా, 260 ఎస్సీ ఓటర్లు ఉన్నారు. ఇక్కడ కూడా 8 వార్డు స్థానాలకు బీసీ, బీసీ మహిళ, అన్ రిజర్వ్డ్, అన్ రిజర్వుడ్ మహిళలకు రిజర్వేషన్లు కేటాయించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగంగా ప్రతిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ ఈసారి తమకు రిజర్వేషన్లు కేటాయించపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లు గానే ఉండాలా..? పోటీ చేసేందుకు రిజర్వేషన్లు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నిస్తున్నారు. ఇది అధికారుల తప్పిదం వల్లే తమకు తీరని అన్యాయం జరిగిందని ఆయా గ్రామాల ఎస్సీలు మండిపడుతున్నారు. అలాగే హద్నూర్ గ్రామంలో ఒకటో వార్డులో బీసీలు ఉండగా ఎస్సీ మహిళకు రిజర్వ్ చేశారు.
ఎస్సీ ఓటర్లు ఉండగా.. బీసీ మహిళకు రిజర్వేషన్
ముర్తుజాపూర్ గ్రామంలో ఐదో వార్డులో ఎస్సీ ఓటర్లు ఉండగా బీసీ మహిళకు రిజర్వేషన్ కేటాయించడం హాస్యస్పదమని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకొని వార్డు సభ్యుల స్థానాల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు ప్రకటించి న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఎన్నికలకు దూరంగా ఉంటామని ఆయా గ్రామాల ఎస్సీలు హెచ్చరిస్తున్నారు.
ఎస్సీలకు న్యాయం చేయాలి : బీఆర్ఎస్ ఎస్సీ సెల్ నాయకుడు పూర్ణచందర్, ఖలీల్ పూర్ (న్యాల్కల్ మండలం)
స్థానిక సంస్థల ఎన్నికల్లో వాడు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లు కేటాయించకపోవడం అన్యాయం. ప్రతిసారి జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ వర్గాలకు చెందిన అభ్యర్థులు పోటీ చేస్తే. ఈసారి మాత్రం అధికారుల తప్పిదమా..?, ప్రభుత్వ నిర్వాకమా తెలియక ఎస్సీలకు పోటీ చేసేందుకు అవకాశం లేకుండా చేశారు.
కేవలం ఓటర్లు గానే ఉండాలా… పోటీ చేసేందుకు అర్హులము కాదా.. అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వార్డు సభ్యుల స్థానాలకు కేటాయించిన రిజర్వేషన్ మార్పు చేసి ఎస్సీలకు కేటాయించేలా చూడాలి. లేనిపక్షంలో ఆందోళన చేస్తామని, ఎన్నికలకు దూరంగా ఉంటామని హెచ్చరించారు.
Harish Rao | కేసీఆర్కు రైతుకు ఉన్నది పేగు బంధం.. కాంగ్రెస్కు ఉన్నది కేవలం ఓటు బంధం: హరీశ్ రావు
DA hike | పండగ వేళ గుడ్న్యూస్ చెప్పనున్న కేంద్రం.. ఉద్యోగులకు డీఏ పెంపు..?
Asia Cup | ఆసియా కప్ ట్రోఫీ వివాదం.. బీసీసీఐకి క్షమాపణలు చెప్పిన పీసీబీ చైర్మన్ నఖ్వీ..!