Asia Cup | ఆసియా కప్ ట్రోఫీ వివాదం.. బీసీసీఐకి క్షమాపణలు చెప్పిన పీసీబీ చైర్మన్ నఖ్వీ..!
Asia Cup | పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ భారత క్రికెట్ బోర్డుకు క్షమాపణలు చెప్పాడు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత జరిగిన పరిణామాలకు క్షమాపణలు చెప్పినట్లుగా ఇండియా టుడే కథనం ప్రచురించింది. మంగళవారం జరిగిన ఏసీసీ సమావేశంలో నఖ్వీ క్షమాపణలు చెప్పాడంటూ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Asia Cup | పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ భారత క్రికెట్ బోర్డుకు క్షమాపణలు చెప్పాడు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత జరిగిన పరిణామాలకు క్షమాపణలు చెప్పినట్లుగా ఇండియా టుడే కథనం ప్రచురించింది. మంగళవారం జరిగిన ఏసీసీ సమావేశంలో నఖ్వీ క్షమాపణలు చెప్పాడంటూ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏసీసీ చైర్మన్‌గా ఉన్న పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ, పతకాలు అందుకునేందుకు భారత జట్టు నిరాకరించింది. ఆ తర్వాత టీమిండియా కప్‌ను లేకుండానే సంబురాలు చేసుకుంది. ఆ తర్వాత కప్‌ను నఖ్వీ మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లాలని ఏసీసీ అధికారులను ఆదేశించారు.
మంగళవారం జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో ఆసియా కప్ ట్రోఫీ వివాదంలో మొహ్సిన్ నఖ్వీ వ్యవహరించిన తీరుపై బీసీసీఐ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. సమావేశానికి హాజరైన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రోఫీ ఏసీసీ ఆస్తి, పీసీబీ చీఫ్ ఆస్తి కాదని స్పష్టం చేశారు. ట్రోఫీ, పతకాలు హోటల్ గదికి తీసుకువెళ్లే అధికారం నఖ్వీకి లేదని గుర్తు చేశారు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా జట్టుకు ట్రోఫీని సరైన పద్ధతిలో అప్పగించాలని, తక్షణమే ఏసీసీ సంరక్షణలో ఉండాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోందని శుక్లా స్పష్టం చేశారు. అయితే, బీసీసీఐకి క్షమాపణలు చెప్పినప్పటికీ భారత క్రికెట్ జట్టుకు ట్రోఫీని తిరిగి ఇవ్వడానికి నఖ్వీ నిరాకరించాడు. భారత్‌కు ట్రోఫీ కావాలంటే, సూర్యకుమార్ యాదవ్‌ను ఏసీసీ కార్యాలయంలో వ్యక్తిగతంగా పంపాలని నఖ్వీ సూచించారు. ఫైనల్ రోజున నఖ్వీ నుంచి ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించినప్పుడు.. మళ్లీ భారత జట్టు కెప్టెన్ మళ్లీ ఎందుకు దుబాయికి వస్తాడని బీసీసీఐ బీసీసీఐ బదులిచ్చింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

