School Building | నిజాంపేట్, సెప్టెంబర్ 13 : గత నలబై, యాభై ఏండ్ల క్రితం నిర్మించిన పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో ఆ గ్రామానికి చెందిన విద్యార్థులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని విద్యాభ్యాసం చేయవలసిన పరిస్థితి నెలకొన్నది. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల పరిధిలోని దామరచెరువు గ్రామంలో నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ముంపునకు గురైన గ్రామం దామరచెరువు. అప్పట్లో గ్రామంతోపాటు ప్రాథమిక పాఠశాల భవనం నిర్మించారు.. అప్పట్లో రెండు గదులు ప్రాథమిక పాఠశాల భవనాన్ని నిర్మించగా రెండు గదులు శిథిలావస్థకు చేరాయి.
అందులో ఒక గది అద్వానంగా మారడంతో ఒకే గదిలో 40 మంది విద్యార్థులతో ఐదు తరగతులు విద్యాబోధన అందిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అద్వానంగా మారిన గదిని వదిలేయడంతో ఆ గదిలో ప్రస్తుతం గ్రామస్తులు గ్రామపంచాయతీ విధులను నిర్వహిస్తున్నారు. అదనంగా పాఠశాల కొరకు అదనపు గదిగా నిర్మించిన వంటగదిలో ప్రస్తుతం అది అంగన్ వాడీకి వినియోగిస్తున్నారు.
ఏది ఏమైనా పాఠశాల గది శిథిలావస్థకు చేరి పైకప్పు పెచ్చులు ఊడటంతో చిన్నపాటి వర్షం వచ్చినా గదిలో నీరు నిలవడంతో విద్యార్థులకు ఆటంకం కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయభయంగా విద్యా బోధనలు చేస్తున్నారు. శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిన పాఠశాల భవనాన్ని పూర్తిగా తొలగించి అన్ని అంగుళాలతో నూతన భవనాన్ని నిర్మించాలని గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
కొత్త పాఠశాల భవనాన్ని నిర్మించాలి : శివరాం నాయక్. దామరచెరు
ఈ స్కూలు భవనాలు నిర్మించి చాలా రోజులైంది. ఇవి ప్రస్తుతం కూలే పరిస్థితిలో ఉన్నాయి. వర్షం వస్తే గదులలో నీరు ఉండడంతో పాఠశాల ఆరు బయటనే విద్యార్థులను కూర్చుండబెట్టి చెప్తున్నారు. అందులో ఒక రూంలో గ్రామపంచాయతీ విధుల కోసం సామాన్లు ఉన్నప్పటికీ అది కూడా పూర్తిగా పెచ్చులూడి తడిసిపోతుంది. కనుక అధికారులు వెంటనే స్పందించి కొత్త పాఠశాల భవనాన్ని నిర్మించాలని కోరుకుంటున్నాం.
Edupayala Temple | పెరిగిన వరద.. వనదుర్గ ఆలయం మరోసారి మూసివేత
Rayapole | కొత్తపల్లిలో పడకేసిన పారిశుధ్యం.. వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు
Tragedy | రెండేళ్ల కూతుర్ని పాతిపెట్టి.. ప్రియుడితో పరారైన మహిళ.. మూడు నెలల తర్వాత బయటపడ్డ నిజం!