Illegal Sand Mining | చిలిపిచెడ్, ఏప్రిల్ 15: మండలంలోని మంజీరా నది, చెరువులలో అనుమతులు లేకుండా మట్టి, ఇసుక తరలించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ సింధూజ, ఆర్ఐ సునీల్ సింగ్ చౌహన్ హెచ్చరించారు. సోమవారం రాత్రి మండలం పరిధిలోని చండూర్ గ్రామ శివారులో ఉన్న మంజీరా నదిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు.
అలాగే సోమక్కపేట శివారులో సామ్ల్యా తండాలో అనుమతి లేకుండా ప్రభుత్వ భూమి నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లను ఆర్ఐ పట్టుకున్నారు. అనంతరం అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ యజమాని చండూర్ గ్రామానికి చెందిన మద్దూరి లక్ష్మయ్యకు రూ.10 వేలు, సామ్ల్యా తండాకు చెందిన భిక్షపతి నాయక్‌కు రూ.5 వేలు జరిమానా వేసినట్లు తెలిపారు.
చిలిపిచెడ్ మండలంలో ఎక్కడైనా.. ఎవరైనా అనుమతి లేకుండా ఇసుక, మట్టిని తరలిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్ సింధూజ హెచ్చరించారు.
BRS | బీఆర్ఎస్ రజతోత్సవ గులాబీ సేన రెడీ.. శ్రేణులకు ఎమ్మెల్యే మాణిక్‌రావు దిశానిర్దేశం
MLC Kavitha | బెదిరింపులకు పాల్పడేవారిని వదిలిపెట్టేదే లేదు.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Rajapet : ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన బోధన : ఎంఈఓ చందా రమేశ్