రాజాపేట, ఏప్రిల్ 15 : బడి బయట పిల్లలందరినీ ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట ఎంఈఓ చందా రమేశ్ కోరారు. మంగళవారం మండలంలోని కొత్తజాలలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరిగి బడి బయటి పిల్లలతో పాటు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను గుర్తించి నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ బడుల ప్రాముఖ్యతను పిల్లల తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన బోధన అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గౌటే బాలరాజు, విజయలక్ష్మి, సరిత, ఇందిర పాల్గొన్నారు.