అధికమైతే అనర్థమే
మొటిమలు అధికంగా ఉంటే.. వాటిని దాచడానికి ఎక్కువ మేకప్ వేస్తుంటారు. దీనివల్ల చర్మానికి మరింత నష్టం వాటిల్లుతుంది. మొటిమలు ఇంకా తీవ్రం అవుతాయి.
మొటిమలు అధికంగా ఉంటే.. వాటిని దాచడానికి ఎక్కువ మేకప్ వేస్తుంటారు. దీనివల్ల చర్మానికి మరింత నష్టం వాటిల్లుతుంది. మొటిమలు ఇంకా తీవ్రం అవుతాయి. ఇక సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారిలోనూ మేకప్ వల్ల లేనిపోని చర్మ సమస్యలు వస్తుంటాయి. ఇందుకుగల కారణాలు, ప్రత్యామ్నాయాలను నిపుణులు వివరిస్తున్నారు.
మేకప్ ఎక్కువగా వేస్తే.. చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. దాంతో, గాలి ఆడకుండా అవుతుంది. చర్మంలో ఉండే సహజ నూనెలు బయటికి రాలేక.. బ్యాక్టీరియాతో కలిసిపోయి మరిన్ని కొత్త మొటిమలకు దారితీస్తాయి. అదే సెన్సిటివ్ స్కిన్ ఉన్నట్లయితే.. మేకప్‌లో వాడే రసాయనాలు, సువాసనలు చికాకు కలిగిస్తాయి. ఎక్కువగా మేకప్ వేసుకుంటే.. చర్మం ఎర్రబడటం, దురద లాంటి సమస్యలు పెరుగుతాయి. అంతేకాకుండా, అధికంగా వేసిన మేకప్‌ను క్లీన్ చేయడానికి చర్మాన్ని గట్టిగా రుద్దుతారు. దీనివల్ల అప్పటికే ఉన్న మొటిమలు చిట్లిపోతాయి. ఫలితంగా, ముఖంపై శాశ్వత మచ్చలు ఏర్పడతాయి. ఇలా కాకుండా ఉండాలంటే..
కొన్ని చిట్కాలు పాటించాలని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. మొటిమలు ఎక్కువగా, సెన్సిటివ్ స్కిన్ ఉండేవారు.. నాన్-కామెడోజెనిక్ మేకప్ ఉత్పత్తులు వాడాలి. ఆయా ఉత్పత్తులు చర్మ రంధ్రాలను మూసివేయకుండా ఉంటాయి. ఇక ఫుల్ కవరేజ్ ఫౌండేషన్ కంటే తేలికపాటి క్రీమ్ వాడటం బెటర్. కేవలం మొటిమలు ఉన్న ప్రాంతంలోనే క్లెన్సర్ వాడాలి. మేకప్ బ్రష్‌లు, స్పాంజ్‌లను తరచుగా శుభ్రం చేసుకోవాలి. లేకుంటే అందులో ఉండే బ్యాక్టీరియా.. చర్మానికి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. ఇక రాత్రి పడుకునే ముందు మేకప్‌ను పూర్తిగా తొలగించాలి. ఇలా చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే.. మొటిమలు దూరం అవుతాయి. చర్మం
నిగారింపు సంతరించుకుంటుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

