Robbery | నిజాంపేట్, నవంబర్ 10 : సంగారెడ్డి జిల్లాలో నిజాంపేట్ మండల పరిధిలో దోపిడీ దొంగలు వీరంగం సృష్టించారు. మండల కేంద్రమైన నిజాంపేట్లో తాళం వేసి ఉన్న ఓ వ్యక్తి ఇంటిని టార్గెట్గా చేసుకున్నారు. మర్రి దత్తు అనే వ్యక్తి ఇంట్లోకి ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఇంట్లో ఉన్న 4 తులాల బంగారం, 45 తులాల వెండి ఎత్తుకెళ్లారు.
గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి నిజాంపేట్ గ్రామంలోని మర్రి దత్తు అనే వ్యక్తి ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న 4 తులాల బంగారం, 45 తులాల వెండి, సుమారు రూ.లక్ష నగదును దొంగిలించినట్లు నారాయణఖేడ్ ఎస్ఐ శ్రీశైలం తెలిపారు. ఇంటి యజమాని కావేరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీశైలం పేర్కొన్నారు.

Collector Koya Sriharsha | ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు.. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష