Ramzan | కొండాపూర్, మార్చి 31 : మండల కేంద్రమైన కొండాపూర్తోపాటు గంగారం, అనంతసాగర్, మల్లేపల్లి, గొల్లపల్లి, తేర్పోల్, మల్కాపూర్ సహా అన్ని గ్రామాల్లో ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు అలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ చెప్పుకున్నారు.
చిన్నాపెద్దా అనే తేడా లేకుండా నూతన వస్త్రాలు ధరించి.. గ్రామాల్లో ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కలిసి శుభాకాంక్షలు తెలుపుకొని రంజాన్ పండగను జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండలాధక్షులు ఎండీ రుక్మోద్దీన్, జడ్పీ మండల కో-ఆప్షన్ సభ్యులు అమినోద్దీన్, మైనార్టీ సెల్ మండలాధ్యక్షుడు జలీల్, మాజీ సర్పంచ్లు షఫీ, ఫయీం, నాయకులు కొండాపూర్ షేక్ మన్సూర్, మైబుబ్అలీ, సాజిత్, సద్దాం, సల్లావోద్దీన్, రఫీక్, సర్థార్, అన్ని గ్రామాల పెద్దలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, తాజా మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, యువకులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
AP News | వారం రోజుల నుంచి గుడి ముందు నగ్నంగా పూజలు.. ఉగాది రోజు సజీవ సమాధికి యత్నం!
Jagadish Reddy | ఆ భాషే ఆయన్ను బొందపెడుతుంది.. సీఎం రేవంత్ రెడ్డిపై జగదీశ్ రెడ్డి ధ్వజం