Pyara Nagar Dumping yard | గుమ్మడి దల, జూన్ 4 : 120 రోజులుగా ప్యారానగర్ డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్నా రాష్ట్ర పాలకవర్గం, జిల్లా యంత్రాంగం స్పందించకపోవడం అన్యాయమని రైతు జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్ గ్రామ శివారులో ఏర్పాటు కాబోతున్న డంపింగ్‌యార్డును రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహారదీక్షలు బుధవారానికి 120వ రోజుకు చేరుకున్నాయి.
ఈ సందర్భంగా దీక్షలో పాల్గొన్న రైతు జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. డంపింగ్‌యార్డు (ఎంఎస్‌డబ్ల్యూ)కు ఇచ్చిన అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇందులో రైతు జేఏసీ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
ACB Summons: 2 వేల కోట్ల స్కామ్‌లో సిసోడియా, సత్యేంద్రకు ఏసీబీ సమన్లు
MLC Kavitha | కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే నోటీసులు.. రేవంత్ సర్కారుపై కవిత ఫైర్..
Karimnagar | తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.. నగదు, బియ్యం బస్తాలు ఎత్తుకెళ్లిన దొంగలు