Pregnant women | అది ఓ తండా.. అక్కడివాసులకు ఏమైనా ఎమర్జెన్సీ తలెత్తితే వారు పడే పాట్లు వర్ణణాతీతం. అందుకు నిదర్శనమే తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ దృశ్యం. నాగల్ గిద్ధ సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్దా మండలం మూన్యా నాయక్ తండాలో ఓ గర్బిణీ మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. అయితే ఆమెను తీసుకెళ్లాలంటే మాత్రం అంబులెన్స్‌ను తీసుకురాలేని పరిస్థితి. ఎందుకంటే ఆ తండాకు కనీసం అంబులెన్స్ వెళ్లి వచ్చేందుకు కూడా దారి లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో పురిటినొప్పులతో బాధపడుతున్న ఆ మహిళను చేసేదేమి లేక కుటుంబసభ్యుడు ఆమెను రెండు కిలో మీటర్ల వరకు భుజం మీద ఎత్తుకెళ్లే క్రమంలో మార్గమధ్యలో ఆ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డను వెంటనే అంబులెన్స్‌లో నారాయణఖేడ్ ఆస్పత్రికి తరలించారు. ఇక మరో మహిళకు ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ఆ తండాకు రోడ్డు సౌకర్యం కల్పించాలని ఈ విషయం తెలిసిన వారందరూ కోరుకుంటున్నారు.
Karnataka | ఓటర్ లిస్ట్‌లో అక్రమాలు.. సొంత పార్టీ నేతలపై కర్ణాటక మంత్రి ఫైర్
Srinuvaitla | బాలకృష్ణతో సినిమాపై స్పందించిన శ్రీనువైట్ల.!
Film Federation | ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికుల నిరసన