Srinuvaitla | టాలీవుడ్ ఒకప్పటి స్టార్ దర్శకుడు శ్రీనువైట్ల ప్రస్తుతం హిట్లు లేక సతమవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ‘విశ్వం’ (గోపీచంద్)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతడు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు. దీంతో ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అయితే చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌లతో సినిమాలు చేసిన శ్రీనువైట్ల బాలకృష్ణతో సినిమాను తెరకెక్కించలేదన్న విషయం తెలిసిందే. తాజాగా బాలయ్యతో సినిమా ఉంటుందా లేదా అనే విషయంపై మీడియా అతడిని అడుగగా.. శ్రీనువైట్ల మాట్లాడుతూ.. బాలకృష్ణ అంటే తనకు చాలా ఇష్టమని అతడు నటించిన ‘ప్రాణానికి ప్రాణం’ సినిమాతోనే తన కెరీర్ మొదలయ్యింది తెలిపాడు. అయితే బాలయ్యతో సినిమా చేయాల్సి ఉన్నా అనుకోని కారణాల వలన అది ముందుకు పోలేదని.. ఫ్యూచర్లో అయిన బాలకృష్ణతో తప్పకుండా సినిమా చేస్తానని తెలిపాడు శ్రీనువైట్ల.