మేడ్చల్ : మేడ్చల్ జిల్లా కుతుబుల్లాపూర్ తహసీల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గణేష్ ( Ganesh ) లంచం తీసుకుంటూ ఏసీబీకి ( ACB ) పట్టుబడ్డాడు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం తహసీల్ కార్యాలయాన్ని సంప్రదించిన బాధితుడికి జూనియర్ అసిస్టెంట్ రూ.20 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో మొదటి విడతగా రూ.5 వేలు తీసుకోగా చివరి విడతగా సోమవార రూ.15 వేలు లంచం తీసుకుంటూ సిటీ రేంజ్ వన్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.