Yoga | జహీరాబాద్, జూన్ 2 : యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పెంపొందుతుందని, ప్రతీ ఒక్కరూ తమ జీవన శైలిలో యోగాను భాగస్వామ్యం చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన న్యాల్కల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఆయుర్వేద వైద్యాధికారి గణపతి రావు జిల్లా అన్నారు.
ముందస్తు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఆయుష్మాన్ భారత్ మందిరంలో సోమవారం ఆయన వైద్యాధికారులు, సిబ్బందితో యోగాసనాలు వేయించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. శారీరక వ్యాయామం చేయాలని, ప్రస్తుత తరుణంలో మానసిక ఒత్తిడిని యువత ఎదుర్కోలేక పోతుండడంతో ధ్యానం, యోగాతో మనసును కట్టడి చేసినట్లయితే మంచి మార్గం వైపు పయనించవచ్చునన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యాధికారి అమ్రృత్ రాజ్, కమ్యూనిటీ హెల్త్ ఆర్గనైజర్ సుదర్శన్ , ల్యాబ్ టెక్నీషియన్ మాణయ్య, MLHP డా వైశాలి , ఈస్టర్ రాణి, సూపర్వైజర్ మార్తా, ఆనందం, సిబ్బంది మంజుల తదితరులు పాల్గొన్నారు.
Medak | ఉద్యోగ, ఉపాధ్యాయుల హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి: టీజీసీపీఎస్ ఈయూ నేత నర్సింహులు
Textbooks | పాపన్నపేట మండలంలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన ఎంఈవో ప్రతాప్ రెడ్డి