Baboons | జహీరాబాద్, సెప్టెంబర్ 17 : కొండముచ్చులు గుంపులు గుంపులుగా తిరుగుతూ దారిన వెళ్లే వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. దీంతో బయటకు రావాలన్నా కాలనీవాసులు జరుకుతున్నారు. ఇది ఎక్కడో కాదు.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఈ దుస్థితి నెలకొంది.
గత నాలుగైదు రోజులుగా పట్టణంలోని శాంతినగర్ బాగ రెడ్డిపల్లి హౌసింగ్ బోర్డ్ సంతోషిమాత మందిర్ కాలనీలోని గాంధీ నగర్ వార్డుల్లో కొండముచ్చులు గుంపులు వీర విహారం చేస్తున్నాయి. ఆయా కాలనీలో వెళ్తున్న వారిపై కొండముచ్చులు ఇండ్లపై నుంచి దూకేసి దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. చిన్న నుంచి పెద్దల వరకు ఇళ్లలోంచి బయటికి రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఇండ్లపై గుంపులు గుంపులుగా తిరుగుతూ ఇండ్లలోకి చొరబడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు.
చిన్నారులు, యువకులు పాఠశాలకు, కళాశాలకు వెళ్లేందుకు తల్లిదండ్రులు కర్రలు చేతులో పట్టుకొని వెంట వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. నిత్యావసర సరుకుల కోసం బయటకు వెళ్లొచ్చే పెద్దలను సైతం కొండ ముచ్చులు విడిచి పెట్టడం లేదన్నారు. గత నాలుగైదు రోజులుగా ఆయా కాలనీలలో 20 మందికిపైగా కొండముచ్చుల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. కొండముచ్చుల భారీ నుంచి కాపాడాలని సంబంధిత మున్సిపల్ ఫారెస్ట్ అధికారులకు మొరపెట్టుకున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.
ఎవరు కాపాడుతారు..?
కుక్కలను పట్టుకుంటాము కానీ కొండముచ్చులను ఎలా పట్టుకుంటామని, అది ఫారెస్ట్ అధికారులు చూసుకోవాల్సి ఉంటుందని మున్సిపల్ అధికారులు సమాధానాలు చెబుతున్నట్లు కాలనీ వాసులు వాపోతున్నారు. ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్తే చూద్దాం చేద్దాం అంటూ కాలం వెళ్లదీస్తున్నారన్నారు. అటు మున్సిపల్ శాఖ అధికారులు ఇటు ఫారెస్ట్ అధికారులు కొండముచ్చుల భారీ నుంచి కాపాడకపోతే ఎవరు కాపాడుతారు అంటూ ఆయా కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకొని ఆయా కాలనీలో కొండముచ్చుల దాడులనుంచి కాపాడేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొండముచ్చులు పట్టుకొని దూరంగా విడిచి పెట్టేలా చూడాలని కోరుతున్నారు.
Miyapur | మియాపూర్ డిపోలో విషాదం.. గుండెపోటుతో కండక్టర్ మృతి
KTR | రాజ్యాంగంపై, సుప్రీంకోర్టుపై బీజేపీకి ఏమాత్రం గౌరవం లేదు : కేటీఆర్
Powerhouse OST | రజినీకాంత్ ‘కూలీ’ నుంచి ‘పవర్హౌస్’ ఓఎస్టీ విడుదల