SFI | జహీరాబాద్ , మార్చి 22 : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో 2026- 27 సంవత్సరానికి ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ బడ్జెట్లో విద్యారంగానికి 8.22% నిధులను మాత్రమే కేటాయించిందని ఎస్ఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు టీ రాజేష్ అన్నారు. ఆదివారం ఎస్ఎఫ్ఐ జహీరాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జహీరాబాద్ ఎమ్మార్వో ఆఫీస్ ఆవరణలో సంగారెడ్డి జిల్లా ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతులను దహనం చేశారు.
ఈ సందర్భంగా టీ రాజేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు చాలా ఉన్నాయన్నారు. ఈ రాష్ట్రంలో దాదాపు 8 వేల కోట్ల దాకా స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్ మెంట్ పెండింగ్లో ఉన్నాయన్నారు . దీనితో పోలిస్తే చాలా సమస్యలు విద్య రంగంలో ఉన్నాయన్నారు గురుకులాలకు సొంత భవనాలు లేవు అలాగే SMH హాస్టల్స్ కు సొంత భవనాలు లేవు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ యూనివర్సిటీల కు సరైన మౌలిక సదుపాయాలు లేక తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నాయన్నారు. ఇన్ని సమస్యలను పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి 2026- 27 సంవత్సరం కలిపి మొత్తం 26,674 కోట్లు కేటాయించింది.
ఇంత తక్కువ బడ్జెట్ తో రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించలేక పోతుందన్నారు. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కారం కావాలంటే విద్య రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని రాష్ట్రంలో విద్యార్థి సంఘాలు, మేధావులు, విద్యార్థులు గత రెండు సంవత్సరాల నుండి చెబుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచింపజేసి విద్యా రంగాన్ని చిన్నచూపు చూడకుండా 30% నిధులు కేటాయించి రాష్ట్రంలో విద్యా రంగ సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు నడవాలి అన్నారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి సందీప్ డివిజన్ నాయకులు అభి, పవన్ , కృష్ణ , హరీష్ , అజయ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Bandlaguda | ఔటర్ రింగ్ రోడ్ పై లారీని ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి
Dhurandhar 2 Blunder | ‘ధురంధర్ 2’ యాక్షన్ సీన్లో కెమెరామెన్ ప్రత్యక్షం.. నెటిజన్ల ట్రోలింగ్.!