Teacher killed, students injured | స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లలో అపశృతి.. విద్యుతాఘాతంతో టీచర్ మృతి, విద్యార్థులకు గాయాలు
Teacher killed, students injured | ఒక స్కూల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్ల సమయంలో విషాద సంఘటన జరిగింది. జెండా ఆవిష్కరణకు సంబంధించిన ఐరన్ పోల్‌కు విద్యుత్ వైర్ తగిలింది. దీంతో కరెంట్ షాక్‌తో టీచర్ మరణించగా, ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు.
భువనేశ్వర్: ఒక స్కూల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్ల సమయంలో విషాద సంఘటన జరిగింది. జెండా ఆవిష్కరణకు సంబంధించిన ఐరన్ పోల్‌కు విద్యుత్ వైర్ తగిలింది. దీంతో కరెంట్ షాక్‌తో టీచర్ మరణించగా, ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. (Teacher killed, students injured) ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక ప్రైవేట్ స్కూల్‌కు చెందిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) ప్రియబ్రత బెహెరా కొందరు విద్యార్థులతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. జెండా ఆవిష్కరణ స్టాండ్‌కు ఐరన్ పైపు అమర్చడానికి వారు ప్రయత్నిస్తున్నప్పుడు అనుకోకుండా పైనుంచి వెళ్తున్న విద్యుత్ లైన్‌కు అది తగిలింది. ఈ నేపథ్యంలో ఆ టీచర్, ముగ్గురు విద్యార్థులు విద్యుతాఘాతానికి గురయ్యారు.
కాగా, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే పీఈటీ ప్రియబ్రత బెహెరా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. విద్యుతాఘాతం వల్ల గాయపడిన ముగ్గురు విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

