వీధికుక్కల సంతాన నియంత్రణకు కేంద్రాల ఏర్పాటు
తెలంగాణలో వీధి కుకల సమస్య పెరుగుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గ్రామాల్లోనూ కుకల సంతాన నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వీబీజీ రామ్‌జీ పథకం కింద ఒకో కేంద్రానికి రూ.30 లక్షలు కేటాయించి నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
- ఒక్కో కేంద్రానికి రూ.30 లక్షలు కేటాయింపు
- సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో జంతు సంక్షేమ మండలి నిర్ణయం
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో వీధి కుకల సమస్య పెరుగుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గ్రామాల్లోనూ కుకల సంతాన నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వీబీజీ రామ్‌జీ పథకం కింద ఒకో కేంద్రానికి రూ.30 లక్షలు కేటాయించి నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇటీవల జరిగిన రాష్ట్ర జంతుసంక్షేమ మండలి సమావేశంలో ప్రణాళికను సమర్పించారు. ఈ ప్రణాళిక ప్రకారం వీధికుకలతో తీవ్ర ఇబ్బంది ఉన్నచోట ముందుగా కేంద్రాలు నిర్మిస్తారు. మండలానికి ఒక కేంద్రం చొప్పున ఏర్పాటు చేసి, తర్వాత గ్రామాలకు విస్తరిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్, ఇతర నగరాల్లోనే ఇలాంటి కేంద్రాలు ఉన్నాయి.
సుప్రీంకోర్టు వీధికుకలను నియంత్రించాలని ఆదేశించిన నేపథ్యంలో, గ్రామాల్లో కూడా దాడులు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. సమస్య ఎకువగా ఉన్న గ్రామాలు గుర్తించి పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ద్వారా నిర్మాణాలు చేపట్టనున్నారు. ఆ తర్వాత ఆ కేంద్రాలను పశుసంవర్ధక శాఖకు అప్పగిస్తారు. గ్రామపంచాయతీ సిబ్బంది కుకలను పట్టుకొని తీసుకువస్తే, వైద్యులు స్టెరిలైజేషన్ శస్త్రచికిత్సలు చేసి, రేబీస్ నివారణ టీకాలు వేసి వదిలేస్తారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తే నగరాల్లో శస్త్రచికిత్సకు రూ.1,500, గ్రామాల్లో రూ.1,650 చొప్పున చెల్లించేందుకు శాఖ అనుమతించింది. ఈ చర్యల ద్వారా వీధి కుకల సంఖ్యను నియంత్రించి, ప్రజలకు భయం లేకుండా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
కోర్టు ఫీజు అంశం విచారణలోనే తేల్చాలి
- ప్రిన్స్ అజ్మత్ జా పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఆస్తుల విభజనకు సంబంధించిన దావాలో వాది చెల్లించిన కోర్టు ఫీజు సరైనదా లేక వాటా మారెట్ విలువ ఆధారంగా ఫీజు చెల్లించాలా అనే అంశాన్ని కేసు విచారణ సమయంలోనే నిర్ణయించాలని హైకోర్టు స్పష్టంచేసింది. నిజాం కుటుంబానికి చెందిన ప్రిన్స్ అజ్మత్ జా, మరో వ్యక్తి దాఖలు చేసిన సివిల్ రివిజన్ పిటిషన్‌ను జస్టిస్ సామ్కోశీ కొట్టివేశారు. ఐదు ఆస్తుల విభజన, ప్రత్యేక స్వాధీనం కోసం దాఖలైన దావాలో కింగ్ కోఠి/నజ్రీబాగ్ ఆస్తికి సంబంధించి 2018లో నమోదైన విక్రయపత్రం చెల్లదని ప్రకటించాలని వాది కోరారు.
వాది కోర్టు ఫీజు చట్టంలోని సెక్షన్ 34(2) కింద స్థిర రుసుం చెల్లించారు. ఆస్తులపై మొదటి ప్రతివాదికి ప్రత్యేక స్వాధీనం ఉన్నదని పేరొన్నందున సెక్షన్ 34(1) ప్రకారం తన వాటా మారెట్ విలువ ఆధారంగా కోర్టు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పిటిషనర్లు వాదించారు. వాది సహ వాటాదారుడా, ఆస్తులు ఉమ్మడి స్వాధీనంలో ఉన్నాయా, ఏ నిబంధన ప్రకారం కోర్టు ఫీజు చెల్లించాలన్నది కేవలం వాదనల ఆధారంగా తేల్చలేమని హైకోర్టు పేరొన్నది. ఇందుకు సంబంధించిన అంశాలను వాదనలు, సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం ట్రయల్ కోర్టే నిర్ణయించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ప్రిన్స్ అజ్మత్ జా తదితరులు దాఖలు చేసిన సివిల్ రివిజన్ పిటిషన్‌ను కొట్టివేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

