5లోగా సమస్యలు పరిష్కరించండి.. లేనిపక్షంలో నిరసనలకు వెనుకాడబోం
అక్టోబర్ 5లోగా ఉద్యాన అధికారుల సమస్యలు పరిష్కరించి ఉద్యానశాఖను బలోపేతం చేయాలని, లేనిపక్షంలో నిరసనలకు దిగుతామని రాష్ట్ర ఉద్యానశాఖ అధికారుల సంఘం సర్కార్‌ను హెచ్చరించింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో ఉద్యానశాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషాను కలిసి వినతిపత్రం అందజేసింది.
- కాంగ్రెస్ సర్కార్‌కు ఉద్యాన అధికారుల సంఘం హెచ్చరిక
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : అక్టోబర్ 5లోగా ఉద్యాన అధికారుల సమస్యలు పరిష్కరించి ఉద్యానశాఖను బలోపేతం చేయాలని, లేనిపక్షంలో నిరసనలకు దిగుతామని రాష్ట్ర ఉద్యానశాఖ అధికారుల సంఘం సర్కార్‌ను హెచ్చరించింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో ఉద్యానశాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషాను కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు రావుల విద్యాసాగర్, అసోసియేట్ అధ్యక్షుడు పీ అనంతరెడ్డి, ప్రధాన కార్యదర్శి చింతల రోహిత్ మాట్లాడుతూ.. వాతావరణ మార్పులు, ఎల్ నినో ప్రభావం, నీటికొరత నేపథ్యంలో తకువ నీటితో అధిక దిగుబడి, అధిక ఆదాయం పొందే ఉద్యాన పంటల వైపు రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగుకు అనుకూలమైన భూములు, వాతావరణ పరిస్థితులు, నీటి వనరులు, మారెట్ అవకాశాలు ఉన్నప్పటికీ రైతులను ఉద్యానపంటల వైపు ప్రోత్సహించేందుకు అవసరమైన క్షేత్రస్థాయి యంత్రాంగం లేదని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒకో ఉద్యాన అధికారి సుమారు 5 నుంచి 10 మండలాల బాధ్యతలు చూడాల్సి వస్తుందని, దీంతో పంటల పరిశీలన, పథకాల అమలు, రైతుశిక్షణ వంటి సేవలను సకాలంలో అందించడం కష్టమవుతున్నదని పేర్కొన్నారు. సరిపడా సిబ్బంది లేకపోవడంతో అధికారులపై పనిభారం పెరిగి రైతులకు అందాల్సిన సేవలపై ప్రభావం పడుతున్నదని తెలిపారు.
ఇవీ ప్రధాన డిమాండ్లు..
- ఉద్యానశాఖ అధికారుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించి శాఖను బలోపేతం చేయాలి.
- ఆయిల్‌పామ్, సూక్ష్మనీటి పారుదల, ఇతర కార్యక్రమాల బాధ్యతలకు అనుగుణంగా సిబ్బందిని ఏర్పాటుచేయాలి.
- ప్రతి మండలానికి ఒక ఉద్యాన విస్తరణ అధికారిని, రెండు, మూడు మండలాలకు ఒక ఉద్యాన అధికారిని నియమించాలి.
- అర్హత కలిగిన ఉద్యాన అధికారులకు వెంటనే ఉద్యోగోన్నతులు కల్పించాలి.
- జిల్లాస్థాయిలో అవసరమైన పరిపాలనా, సాంకేతిక, సహాయ సిబ్బందిని నియమించాలి.
విద్యుత్తు ఉద్యోగులతో సీఎండీల చర్చలు
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు సంస్థల్లో అపరిషృత సమస్యలపై సంస్థ సీఎండీలు, ఉన్నతాధికారులు బీసీ, ఓసీ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి నేతలు బుధవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉద్యోగులకు రావాల్సిన 2026 వేతన సవరణపై కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం, యాజమాన్యం సుముఖత వ్యక్తంచేశాయి. ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబీ రూల్స్‌ను వర్తింపజేసే అంశంపై సమీక్షించడంతోపాటు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఆరోగ్య వసతులు, ఇతర అన్ని సెలవులనివ్వడానికి అంగీకరించారు. పాత పెన్షన్ విధానం అమలు అంశాన్ని ప్రభుత్వ పరిశీలనకు పంపేందుకు హామీనిచ్చారు. ఉద్యోగోన్నతుల సమీక్ష, మెరిట్ కమ్ సీనియారిటీ తదితర సమస్యలను త్వరలోనే పరిషరించడానికి సానుకూలంగా స్పందించారు. సమావేశంలో తెలంగాణ విద్యుత్తు బీసీ, ఓసీ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ కోడెపాక కుమారస్వామి, కన్వీనర్ ముత్యం వెంకన్నగౌడ్, చైర్మన్ ఆర్ సుధాకర్‌రెడ్డి, కో- కన్వీనర్ సీ భానుప్రకాష్, రాష్ట్ర నాయకులు ఎం విజయకుమార్, సోమయాజులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్..!
L Murugan | కేంద్ర మంత్రి పదవికి ఎల్ మురుగన్ రాజీనామా.. బీజేపీని తమిళనాడులో బలోపేతం చేసేందుకేనని ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

