Komatireddy Rajagopal reddy | కాంగ్రెస్ సర్కార్ వ్యవహారశైలిపై సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటి రాజగోపాల్ రెడ్డి బహిరంగ విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో బయటి నుంచి వచ్చిన నాయకుల ఆధిపత్యం ఎక్కువై నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది. ఆంధ్రా పాలకుల చెప్పు చేతల్లో మన ప్రభుత్వం ఉండకుండా పేదరికంలో ఉన్న మన ప్రజలకు సేవ చేయాలి.. కానీ వాళ్లు పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయొద్దని సూచించగా.. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ గీత దాటితే సీఎం సహా ఎవరినైనా సహించేది లేదన్నారు.
ఈ క్రమంలో మహేష్ కుమార్ గౌడ్ నాకు నీతులు చెప్పే బదులు ముందు రేవంత్ రెడ్డికి నీతులు చెప్పు అని రాజగోపాల్ రెడ్డి హితవు పలికారు. పక్క పార్టీలో నుండి ఎమ్మెల్యేలను తీసుకున్నందుకు జనాల్లో కాంగ్రెస్ పార్టీ మీద గౌరవం పోయిందన్నారు. దానం నాగేందర్ లాంటి వాళ్లను చూస్తే జనాల్లో రాజకీయ నాయకుల మీద ఉండే గౌరవం పోతుందని చెప్పారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిండు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని అంటుండు.. ఇదేం చిల్లర రాజకీయం అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.. అని నిర్దేశించారు.
కాంగ్రెస్ పార్టీలో ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు తాగే వాళ్ల పెత్తనం ఎక్కువైంది
– కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి https://t.co/OfesQDMaXM pic.twitter.com/Esq7OyxyON
— Telugu Scribe (@TeluguScribe) August 14, 2026
Weekend OTT | ఇండిపెండెన్స్ డే స్పెషల్.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన చిత్రాలివే!
FBI Report | అమెరికాలో భారీగా తగ్గిన హత్యల రేటు.. గడిచిన 75 ఏళ్లలో అత్యంత కనిష్ఠం..!
Rosemary Oil | జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రోజ్మేరీ ఆయిల్..అధ్యయనంలో వెల్లడి..